కామాంధుడు: సంబంధం పెట్టుకోవాలంటూ కోడలిపై చినమామ రేప్
హైదరాబాద్ నగరంలోని సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రి వయస్సున ఓ కామాంధుడు కోడలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టా
హైదరాబాద్: నగరంలోని సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రి వయస్సున ఓ కామాంధుడు కోడలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.
వివరాలు.. సంతోష్‌నగర్ ఠాణా పరిధి మోయిన్‌బాగ్‌కు చెందిన యువతికి(23) ఈది బజార్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. చాలా కాలంగా తన తండ్రితో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలంటూ అతను భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలో చినమామ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మూడు రోజుల క్రితం ఆమె సంతోష్‌నగర్ ఠాణాలో ఫిర్యాదు చేసింది.

మంగళవారం బాధితురాలు తన ఫిర్యాదుపై న్యాయం చేయాలంటూ దక్షిణమండలం డీసీపీని కూడా కలిసి తన ఆవేదనను తెలియజేశారు. దీంతో డీసీపీ ఆదేశాల మేరకు అత్యాచారం కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతోష్‌నగర్ సీఐ శంకర్ వివరించారు.












Click it and Unblock the Notifications