అశ్లీల వెబ్ సైట్ లో యువతి ఫోటోలతో వేధింపులు, యువతి ఇలా..
ఓ యువతి ఫోటోలను అశ్లీల వెబ్ సైట్ లో ఉంచి వేధిస్తున్న యువకుడిని సైబరాబాద్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు.
హైదరాబాద్:ఓ యువతి ఫోటోలను అశ్లీల వెబ్ సైట్ లో ఉంచి వేధిస్తున్న యువకుడిని పైబరాబాద్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు.అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
హైద్రాబాద్ లోని నిజాంపేటకు చెందిన ఓ యువతి 2013-15లో ఇంటర్ చదివేటప్పుడు ఓ యువకుడితో చనువుగా ఉండేది. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు ఆమెను మందలించారు.దీంతో ఆమె ఆ యువకుడికి దూరంగా ఉంటోంది.
అయినా ఆ ఆమ్మాయిని ఆ యువకుడు బెదిరిస్తున్నాడు. తాను బెదిరించకుండా ఉండాలంటే ఫోటోలను తనకు పంపాలని ఆమెను డిమాండ్ చేశారు. బాదితురాలు వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను యువకుడికి పంపింది.

అయతే ఈ ఫోటోలను ఆ యువకుడు విశాఖపట్నం రామకోవల్ చెందిన తన బంధువు సూరబత్తుల దిలీప్ కుమార్ కు పంపించాడు.అతను అమ్మాయి ఫోటోలను అశ్లీల వెబ్ సైట్ లో పోస్టు చేశాడు.
ఈ ఫోటోలను అశ్లీల వెబ్ సైట్ లో పోస్టు చేయడమేకాకుండా ఆ ఆమ్మాయిని వేధించడం ప్రారంభించాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ . హరినాథ్ నేతృత్వంలోని బృందం దిలీప్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనకు ప్రధాన కారకుడైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications