హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక యువతితో నిశ్చితార్థం, మరొకరితో పెళ్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఒక యువతితో నిశ్చితార్ధం చేసుకోని మరో యువతిని పెళ్ళి చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాదులోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సిఐ వెంకటరమణ అందుకు సంబంధించిన వివరాలను అందించారు.

కాప్రా గాంధీనగర్‌కు చెందిన మహేష్‌తో కుషాయిగూడ సోనియా గాంధీ నగర్‌కు చెందిన యువతితో నిశ్చితార్ధం జరిగింది. వీరి వివాహం ఆదివారం జరగాల్సి ఉంది. కానీ మహేష్ మరో యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకుని ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

A man arrested in Hyderabad

యువతి బంధువుల ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు మహేష్ పెళ్ళి చేసుకున్న యువతిని తీసుకొచ్చి కౌన్సింగ్ ఇచ్చి అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

వివాహం చేసుకోవాల్సిన మహేష్ మరో యువతిని పెళ్ళి చేసుకోవడంతో యువతి బంధువులు పోలీస్‌స్టేషన్‌లో అందోళన చేశారు. యవతికి న్యాయం చేయాలంటూ ఇరు యువతుల బంధువులు ఆందోళన చేయడంతో పోలీసులకు తలనొప్పిగా మారిపోయింది.

ఒక యువతికి న్యాయం చేస్తే మరో యువతికి అన్యాయం చేసినా వారవుతారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
A man arrested by Kushaiguda police in Secendurabad for marrying a girl leaving the another girl, whose engagement held with hom
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X