వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగం నుండి తొలగించారని, అసభ్యకర సందేశాలు పంపాడు....చివరకిలా.

ఉద్యోగం నుంచి తీసేశారనే కోపంతో అసభ్యకర సందేశాలను పంపుతూ వేధింపులకు గురిచేస్తోన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ :ఉద్యోగం నుంచి తీసేశారనే కోపంతో అసభ్యకర సందేశాలను పంపుతూ వేధింపులకు గురిచేస్తోన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

వనపర్తికి జిల్లాకు చెందిన తలకంటి అవినాశ్‌రెడ్డి అంబర్‌పేట దుర్గానగర్‌లో ఉంటూ జావా ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. 2016 డిసెంబర్‌ లో ఢిల్లీలోని ఓ ట్రైనింగ్‌ ప్రోగ్రాం కోసం బాధితురాలు అవినాశ్‌రెడ్డిని నియమించుకున్నారు. అతడికి స్కిల్స్‌ లేవని, సరిగా ట్రైనింగ్‌ ఇవ్వడం లేదని ఫీడ్‌బ్యాక్‌ రావడంతో విధుల నుంచి తొలగించారు.

a man arrested for sent abusing messages

చెల్లించాల్సిన డబ్బు ఇచ్చి, శిక్షణ సరిగా ఇవ్వడంలేదని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. ఇంకా డబ్బు ఇవ్వాలని అతడు డిమాండ్‌ చేశాడు. వారు ఒప్పుకోకపోవడంతో బాధితురాలు, ఆమె భర్త వాట్సప్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌కు అసభ్యకర సందేశాలు పంపాడు నిందితుడు.

డబ్బు ఇవ్వకపోతే ఆమె భర్త కాలు విరగొడతానని బెదిరించాడు. అంతేకాదు అసభ్యకరంగా ఆమెను మేసేజ్ లు పంపేవాడు. దీంతో ఆమె మనస్తాపం చెందింది.గత నెల 25న, సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

English summary
a man arrested for sent abusing messages .avinash reddy contract with delhi based company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X