నిద్రిస్తున్న మహిళను రేప్ చేయబోయాడు: కేకలతో పరార్

హైదరాబాద్: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జిల్లాలోని పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామంలో ఓ మహిళపై రాజు (32) అనే వ్యక్తి అత్యాచారం చేయబోయాడు.

గురువారం రాత్రి నిద్రిస్తుండగా అతను ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అయితే, మెలుకువ వచ్చి ఆమె గట్టిగా అరవడంతో అక్కడి నుంచి రాజు పరారయ్యాడు. శుక్రవారం ఉదయం ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

A man attempts to rape a woman in Mahaboobnagar district

సింగరేణి కార్మికుడి మృతి

ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. మండల పరిధిలోని ఇందారం బస్ స్టాండ్ వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. నరడ్ల నరసింహారెడ్డి (33) అనే సింగరేణి కార్మికుడు స్కూటీపై గోదావరిఖని వెళ్తుండగా ప్రమాదవశాత్తూ అతని ద్విచక్ర వాహనం అదుపు తప్పి ముందున్న లారీని ఢీకొట్టాడు.

దీంతో నరసింహారెడ్డి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నరసింహారెడ్డి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+