ఘోరం: భార్య తల నరికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు, అనుమానమే పెనుభూతం

హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడు. నిద్రిస్తున్న భార్య గొంతుకోసి చంపేశాడు. అనంతరం భార్య తల తీసుకుని పోలీస్ ష్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పరిధిలోని ఇమాద్‌నగర్‌లో చోటు చేసుకుంది.

అనుమానంతో భార్య తల నరికి..

అనుమానంతో భార్య తల నరికి..

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పర్వేజ్ అనే వ్యక్తితో 14ఏళ్ల క్రితం సమ్రీన్ బేగంకు వివాహం జరిగింది. భర్త వేధింపులు తాళలేక సమ్రీన్ గతంలో విడాకులు తీసుకుంది. అనంతరం సమ్రీన్‌కు నచ్చజెప్పి ఏడాది క్రితం మళ్లీ పెళ్లి చేశారు. అయితే, భార్యపై అనుమానంతో పర్వేజ్ ఆమెను హతమార్చినట్లు స్థానికలు వెల్లడించారు. గంజాయి మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పర్వేజ్‌ను విచారిస్తున్నారు.

తల్లేనా? కూతురితో తల్లి భిక్షాటనే కాదు, వ్యభిచారం కూడా

తల్లేనా? కూతురితో తల్లి భిక్షాటనే కాదు, వ్యభిచారం కూడా

ఇది ఇలావుండగా, మరో దారుణ ఘటన వెలుగుచూసింది. భిక్షాటన చేయించడంతోపాటు వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేయడంతో కన్నతల్లిపై ఫిర్యాదు చేసింది ఓ కూతురు. ఆమె ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజరాహిల్స్ రోడ్ నెంబర్ 2లో నివసించే బాలిక(16)తో తల్లి భిక్షాటన చేయిస్తుందని నవంబర్ 28న చైల్డ్ లైన్ కు ఓ వ్యక్తి సమాచారం ఇచ్చారు. అమీర్ పేటలోని ఓ ఆలయం వద్ద తల్లీకుమార్తెలు ఉన్నారని సదరు వ్యక్తి చెప్పడంతో చైల్డ్ లైన్ సభ్యురాలు మహేశ్వరి అక్కడికి వెళ్లారు. అక్కడ బాలిక కనిపించకపోవడంతో వెనక్కి వచ్చారు.

వ్యభిచారం చేయమంటూ కూతురుపై తల్లి ఒత్తిడి

వ్యభిచారం చేయమంటూ కూతురుపై తల్లి ఒత్తిడి

బుధవారం ఖమ్మం చైల్డ్ లైన్ సమన్వయకర్త శ్రీనివాస్, హైదరాబాద్ చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ సాల్మన్ రాజుకు ఫోన్ చేసి.. డిసెంబర్ 5న ఖమ్మం బస్టాండ్ వద్ద బాలిక ఉండగా సంరక్షణలోకి తీసుకున్నట్లు చెప్పారు. తల్లి బలవంతంగా భిక్షాటన చేయించడంతోపాటు వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెస్తోందని బాలిక వివరించిందని, అమీర్‌పేట ఆలయం వద్ద నుంచి పారిపోయి ఖమ్మం వచ్చిందని తెలిపారు. సాల్మన్ రాజు ఫిర్యాదు మేరకు బాలిక తల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక పారిపోయినా తల్లి ఫిర్యాదు చేయలేదని, ఆమె సొంత తల్లేనా కాదా? అనే విషయంపై ఆరా తీస్తున్నామని సాల్మన్ రాజు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+