ఫేస్‌బుక్ ద్వారా వివాహితను ట్రాప్ చేసి తెచ్చాడు
హైదరాబాద్: ఫేస్‌బుక్‌లో పరిచయమైన వివాహితను ట్రాప్ చేసిన కేసులో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల హమాలీవాడలో నివాసం ఉండే స్కూల్ అసిస్టెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసిపేట మండలంలోని ఓ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడిని పాఠశాలలో విధులు నిర్వహించే సమయంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
కాసిపేట మండలంలోని ఓ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించే ఉపాధ్యాయుడికి ఫేస్‌బుక్‌లో హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహితతో పరిచయం కావడంతో ఆ మహిళలను ట్రాప్ చేసి మంచిర్యాలలోని పద్మావతి కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంచాడు.

గతంలో అదే మహిళలను మల్కెపల్లి ఆశ్రమ పాఠశాలలోనే కొన్ని రోజులు ఉంచగా సమస్యలు రావడంతో అక్కడి నుంచి మంచిర్యాలలో ఉంచాడు. వివాహిత హైదరాబాద్ వాసి కావడం, ఆమె భర్త అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాలలో ఉన్న వివాహితను గుర్తించిన పోలీసులు ఆమెను పట్టుకున్నారు.
పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని విచారణ కోసం హైదరాబాద్‌కు తరలించారు. సదరు ఉపాధ్యాయుడు మొదటి నుంచి యువతలను ట్రాప్ చేయడం లాంటివి చేసేవాడని, తిర్యాణిలో విధులు నిర్వహించే సమయంలో కూడా ఇలాంటి ఘటనలు ఉన్నాయని అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications