ఇష్టం లేని పెళ్ళి: నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్: ఉప్పల్‌లోని చంగిచర్లలో ఓ నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంజిళ(20) అనే యువతి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఇష్టంలేని పెళ్లే కారణమా లేక మరేదైనా అనేది తెలియాల్సి ఉంది.
యువకుడి దారుణ హత్య
గుర్తుతెలియని దుండగులు ఒక యువకుడిని బండతో తలపై కొట్టి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన గురవారం ఉదయం నిజామాబాద్ నగరంలోని సాయినగర్ కాలనీలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. కాలనీలో ఒక యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలు, యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.
బాలికకు నిప్పుపెట్టిన వృద్ధురాలు
ఆరేళ్ల బాలికపై ఓ వృద్ధురాలు కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ దారుణ సంఘటన నల్గొండ జిల్లా సూర్యాపేటలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలికను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వృద్ధురాలిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications