విషాదం: నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

ఖమ్మం: ఓ నర్సింగ్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరుకు చెందిన కోడెం కృష్ణ, మాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కావ్య(19) ఖమ్మంలోని పారా మెడికల్ కాలేజీలో నర్సింగ్(ఏఎన్ఎం) చదువుతోంది.

స్నేహితురాలైన సీతా మహాలక్ష్మితో కలిసి ఓ అద్దె గదిలో ఉంటున్న కావ్య.. బీకే బజార్‌లోని ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విధులు ముగించుకుని వచ్చిన కావ్య నిద్రపోయింది. బుధవారం ఉదయం స్నేహితురాలు సీతా మహాలక్ష్మి విధులు వెళుతున్న సమయంలో కూడా ఆమె నిద్రలోనే ఉంది.

suicide

కాగా, ఆ తర్వాత కావ్య మరో స్నేహితురాలైన తనుశ్రీ ఆమె ఉంటున్న గదికి వచ్చి కాసేపు మాట్లాడి తిరిగి కిందకు వెళ్లింది. అయితే, ఇలా కిందకి వెళ్తుండగా తనుశ్రీకి పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరిగిందా? అని కావ్య గదికి వెళ్లిన తనుశ్రీ.. అక్కడి దృష్యం చూసి షాకయ్యింది. గదిలో కావ్య ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారిని పిలవడంతో వారు కావ్యను కిందకు దించారు. అప్పటికే కావ్య మృతి చెందినట్లు గుర్తించారు.

తాను మాట్లాడినప్పుడు కావ్య నీరసంగా ఉన్నట్లు తనుశ్రీ తెలిపింది. ఘటనకు ముందు కావ్య తన తల్లి రమాదేవికి ఫోన్‌ చేసింది. తనకు జాగ్రత్తలు చెప్పినట్లు తల్లి రమాదేవి వెల్లడించింది. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె మరణానికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ తల్లి రమాదేశి ఖమ్మం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

suicide

తండ్రి మందలించాడని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం సత్తుపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక వెంగళరావునగర్ కు చెందిన కూరపాటి నారాయణ, ప్రభ దంపతుల కుమారుడు శివనాగరాజు(28) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో తండ్రి నారాయణ తన కుమారుడిని మందిలించారు. మనస్తాపం చెందిన శివనాగరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+