ఆస్పత్రిలో అమానుషం: రెండు కాళ్లు పట్టుకుని రోగిని ఈడ్చుకెళ్లారు (వీడియో)

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో వీల్‌చైర్ గానీ, స్ట్రెచర్ కానీ అందుబాటు లేకపోవడంతో ఓ రోగిని అతని కుటుంబసభ్యులు రెండు కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

గత నెల అంటే మార్చి 31న సాయంత్రం ఓ రోగిని ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఓపీకి కొద్ది దూరంలో కూర్చోబెట్టారు. అయితే, ఓపీ మధ్యాహ్నం వరకు మాత్రమే ఉండటంతో ఆ రోజు కుదరలేదు. దీంతో రాత్రంతా అక్కడే ఉండిపోయారు. మరుసటి రోజు ఏప్రిల్ 1న ఉదయం ఓపీ ప్రారంభమైన తర్వాత.. రోగి కుటుంబసభ్యులు ఓపీ రిజిస్టర్ చేయించారు.దీంతో రెండో అంతస్తులోని డాక్టర్ దగ్గరకు వెళ్లాలని సూచించారు.

 A patient was dragged with his legs by his relatives, to reach doctor, in Nizamabad district hospital

అయితే, రోగి స్పృహలో లేకపోవడంతో అతనికి స్ట్రెచర్ అవసరమైంది. కానీ, స్ట్రెచర్ కానీ, వీల్ చైర్ కానీ అందుబాటులో లేకపోవడంతో రోగిని అతని తల్లిదండ్రులు రెండు కాళ్లు పట్టి నేలపైనుంచే లిఫ్టు వరకు లాక్కెళ్లారు. ఈ ఘటనను చూసి అక్కడున్నవాళ్లు అంతా షాకయ్యారు. రెండో అంతస్తులో కూడా రోగిని అలాగే డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు.

దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రోగిని పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ ఆస్పత్రుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు ఈ ఘటనపై మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలో చోటు చోటు చేసుకుంటున్నాయని ధ్వజమెత్తుతున్నాయి.

ఆస్పత్రిపై అసత్య ప్రచారం చేయొద్దన్న సూపరింటెండెంట్

కాగా, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి రోగిని అతని కుటుంబసభ్యులు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన దృశ్యాలు వైరల్‌ కావడం పట్ల ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ స్పందించారు. ఆస్పత్రికి వచ్చిన రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు.

సదరు రోగిని సహాయకులు మార్చి 31వ తేదీన ఆస్పత్రికి తీసుకొచ్చారని సూపరింటెండెంట్‌ తెలిపారు. లిఫ్ట్‌ వచ్చిందన్న తొందరలో సహాయకులే రోగి కాళ్లు పట్టుకుని లాక్కెళ్లారని చెప్పారు. అది గమనించిన సిబ్బంది వాళ్లను వారించి వీల్‌ఛైర్‌లో తీసుకెళ్లారని వివరించారు. అసత్యాలు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+