Stock Market: స్టాక్ మార్కెట్ పేరుతో రూ.100 కోట్ల మోసం.. లబోదిబోమంటున్న బాధితులు..
ఈ మధ్య స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈక్విటీలో పెట్టుబడులు పెడితే లాభాలు ఎక్కువ వస్తాయని చాలా మంది స్టాక్ మార్కెట్ వైపు పరుగులు పెడుతున్నారు. మోసగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఇలానే స్టాక్ మార్కెట్ పేరుతో ఓ వ్యక్తి కోట్లు కొల్లగోట్టాడు. ఓ వ్యక్తి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోసం అంకుర కార్పొరేట్ సొల్యూషన్స్ ఏర్పాటు చేశారు. అతన్ని నమ్మి చాలా మంది పెట్టుబడులు పెట్టారు. అప్పులు కూడా ఇచ్చారు. తీర అతను బోర్డు తిప్పెసేసరికి లబోదిబోమంటున్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట గ్రామానికి చెందిన గుండ సురేశ్ సీఏ చదువుతూ మధ్యలోనే మానేశఆడు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెడుతూ ట్రేడర్ మారాడు. అయితే అతను మంచి లాభాలు చూపించడంతో సోషల్ మీడియా, మేయిన్ వీడియాలో అతనుపై వార్తలు వచ్చాయి. దీంతో అతన్ని సంప్రదించేవారి సంఖ్య ఎక్కువ అయింది. చాలా మంది అతని ఫోన్ చేసి ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి అని అడిగే వారు. దీంతో అతనికి ఓ కంపెనీ పెట్టాలని ఆలోచన వచ్చింది.

2019లో అంకుర ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రారంభించాడు. జూబ్లీహిల్స్ లోని వెస్టె ఎండ్ మాల్లో కార్యాలయం ప్రారంభించాడు. అంతేకాదు, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ కు చెందిన కొందరికి అందులో ఉద్యోగం ఇవ్వడమే కాకుండా డైరెక్టర్ హోదా కల్పించి వారితో భారీగా పెట్టుబడులు పెట్టించాడు. ఈక్విటీలో భారీగా లాభాలు వస్తాయని చాలా మందిని నమ్మించాడు. అలాగే తనకు కోట్ల విలువైన భూములు ఉన్నాయిని చెప్పుకున్నాడు.
ఆ తర్వాత అప్పులు చేయడం ప్రారంభించాడు. తన సంస్థలో పని చేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల వద్ద అప్పు చేశాడు. దాదాపు 500 మంది రూ. 100 కోట్ల అప్పు తీసుకున్నాడు. వారికి కంపెనీ పేరిట బాండ్లు, చెక్కులు ఇచ్చాడు. వారికి కొద్ది రోజులు వడ్డీ చెల్లించాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో బాధితులు ఆఫీస్ కు వెళ్లి చూడగా.. తాళం వేసి ఉంది. అలాగే ఇంటి వద్దకు వెళ్తే ఇల్లు ఖాలీ చేసినట్లు తెలిసింది. దీంతో బాధితులు మంచిర్యాల జిల్లాలోని సురేశే సొంతూరుకు వెళ్లారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సురేశ్ బంధువులు, స్నేహితులు సుమారు రూ.5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. వీరంతా ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. సురేష్ వరంగల్ కు చెందిన ఒక యువకుడిని అంకుర సంస్థలో ఉద్యోగిగా నియమించుకుని అతడికి డైరెక్టర్ హోదా కల్పించాడు. అతడి బంధువులు, ఫ్రెండ్స్ దగ్గర రూ.13 కోట్లు అప్పు తీసుకున్నాడు.












Click it and Unblock the Notifications