సీఎం కేసీఆర్ సభకు ఆయుధాలు తీసుకొచ్చిన వ్యక్తుల అరెస్ట్
హైదరాబాద్: సీఎం కేసీఆర్ సహా ప్రముఖులు పాల్గొన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు ఆయుధాలతో వచ్చిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో విగ్రహావిష్కరణ అనంతరం నిర్వహించిన సభలో వీవీఐపీలు ఉన్న సమయంలో ఓ వ్యక్తి రైఫిల్‌తో వచ్చేందుకు ప్రయత్నించాడు.
అయితే, ఇందిరాగాంధీ విగ్రహం వద్ద పోలీసులు తనిఖీ చేసి అతడ్ని లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన దాన్ని యజమాని కారులో ఉంచి సభలోకి వెళ్లారు. కొద్దిసేపటికే శివ అనే వ్యక్తి కారులోని రైఫిల్‌తో బయటకు రావడంతో అక్కడున్న పోలీసులు ప్రశ్నించారు. తాను ఖైరతాబాద్ కు చెందిన దొండ్ల మధుయాధవ్ డ్రైవర్‌నని, ఆయుధం గన్‌మెన్‌దని చెప్పాడు. దీంతో అప్పటికే సభలోకి వెళ్లినవారిని వెనక్కి పిలిపించి సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, తన భద్రతకు గన్‌మెన్ కావాలని మధుయాదవ్ ఢిల్లీలోని సామ్రాట్ సెక్యూరిటీస్ ను సంప్రదించాడు. దీంతో వారు అతడికి పంజాబ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ జవాన్ గురుసాహెబ్ సింగ్‌ను కేటాయించారని పోలీసుల విచారణలో తేలింది. గురుసాహెబ్ సింగ్ దగ్గర ఉన్న రైఫిల్, పిస్తోల్ లకు జమ్మూకాశ్మీర్‌లో లైసెన్స్ పొందినట్లు సంబంధిత పత్రాలు చూపారు. నిబంధనల ప్రకారం వ్యక్తిగత భద్రత కోసం తీసుకున్న ఆయుధాలను గన్‌మెన్‌గా వినియోగించేందుకు అనుమతి లేదు.
ఇతరుల వల్ల ప్రాణహాని ఉన్నవారు అంగరక్షకుడిని పెట్టుకోవాలంటే ముందుగా పోలీసు కమిషనర్ అనుమతి తీసుకోవాలి. సదరు వ్యక్తి ఈ నిబంధనలు అతిక్రమించడంతోపాటు ఆయుధాలతో ముఖ్యమంత్రి, వీవీఐపీలు ఉన్న వేదిక వద్ద సంచరించడాన్ని పోలీసులు సీరియస్‌గా పరిగణించారు. ఈ క్రమంలోనే మధుయాదవ్ కారు డ్రైవర్, తాడేపల్లిగూడెం శివప్రకాశ్, గన్‌మెన్ గురుసాహెబ్ సింగ్ లను అరెస్ట్ చేశారు. గన్‌మెన్ నుంచి పాయింట్ 32 పిస్తోలు, 44 తూటాలు, పాయింట్ 315 బోర్ రైఫిల్, 50 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications