పచ్చబొట్టేయించుకున్న పవన్ అభిమానం.. నిహారిక చేతిపై..
హైదరాబాద్ : తెలుగు సినిమా ఇండస్ట్రీలో టన్నుల కొద్ది అభిమాన ఘనాన్ని సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఫాలోయింగ్ విషయంలొ మరే హీరో తనను టచ్ చేయని స్థాయిలో అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారాయన. సినిమాల పరంగానే గాక సహాయం కోసం తనను సంప్రదించే ఎవరికైనా కాదనకుండా సహాయం అందిస్తారనే పేరుండడంతో.. మానవతావాది గాను అభిమానులను ఆయన్ను ఆరాధిస్తుంటారు.
ఇక ఆయన అభిమానుల విషయానికొస్తే.. అభిమానాన్ని చాటుకోవడంలోను తమ హీరో లాగే ట్రెండ్ సెట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫాలోవర్స్. తాజాగా మండలి నిహారిక అనే ఓ పవన్ కళ్యాణ్ అభిమాని తన చేతిపై 'పవన్ కళ్యాణ్' పేరును పచ్చబొట్టుగా పొడిపించుకోవడంతో విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ ఆమె పచ్చబొట్టు పొడిపించుకోవడానికి గల కారణమేమిటంటే.. ఒకప్పుడు ఆత్మహత్యకు కూడా సిద్దపడ్డ స్థితి నుంచి నేడు తానే పదిమందికి స్ఫూర్తిగా మారేవరకు నిహారిక పవన్ కళ్యాణ్ నే స్ఫూర్తిగా తీసుకుందట. నిహారిక 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఇష్టంలేని పెళ్లి చేశారు. పెళ్లయ్యాక భర్త వేధింపులు కూడా తోడవడంతో ఆత్మహత్యకు పాల్పడిన నిహారిక సగం కాలిన గాయాలతో బయటపడింది.
ఇక అప్పటినుంచి తనలాగే జీవితంలో ఒడిదుడుకులను ఎదర్కొంటున్న ఎంతోమందికి ఆమె చేయూతనిస్తూ వస్తోంది. అయితే జీవితంలో తను తిరిగి ఈ స్థాయికి చేరుకోవడానికి గల కారణం పవర్ స్థారే అని నిహారిక చెప్తుండడం జనం చేత మరోసారి పవన్ కి జేజేలు పలికేలా చేస్తోంది.












Click it and Unblock the Notifications