వరంగల్ జైలు నుంచి పరారై.. విశాఖలో చిక్కాడు
విశాఖ/వరంగల్: తెలంగాణలోని వరంగల్ కేంద్ర కారాగారం నుంచి పరారైన ఇద్దరు ఖైదీల్లో ఒకరైన సైనిక్‌సింగ్ పోలీసులకు చిక్కాడు. విశాఖ గాజువాకలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడ్ని శనివారం రాత్రి గాజువాక పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీల పరారీ
అతడిని విచారించగా.. వరంగల్ జైలు నుంచి పారిపోయి వచ్చినట్లు వెల్లడించారు. దీంతో వైజాగ్ పోలీసులు వరంగల్ జైలు అధికారులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో వైజాగ్ చేరుకున్న పోలీసులు సైనిక్‌సింగ్‌ను పటిష్ట భద్రత నడుమ వరంగల్ తీసుకెళ్లారు.

పరారైన మరో ఖైదీ రాజేష్ యాదవ్ కోసం గాలింపు కొనసాగుతోందని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇతడు ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడని తెలిపారు.












Click it and Unblock the Notifications