సైకో: మహిళతో అసభ్య ప్రవర్తన, దాడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని గుడిమాల్కాపూర్‌లో ఓ ఉన్మాది వీరంగం స్పష్టించాడు. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన అతన్ని పట్టుకున్న పోలీసులపైనే ఎదురుదాడికి దిగాడు. ఈ సంఘటన శుక్రవారం టప్పాఛబుత్ర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం గుడిమాల్కాపూర్ కూరగాయల మార్కెట్‌లో ఓ యువకుడు (25) ఉన్మాదిలా మారి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు.
స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడికొచ్చిన టప్పాచబుత్ర పీఎస్‌కు చెందిన కానిస్టేబుళ్లు అతన్ని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా తాళ్లగడ్డ హనుమాన్ ఆలయం వద్ద వాహనంలో నుంచి బయటకు దూకాడు. అదుపులోకి తీసుకునేందుకు యత్నించేసరికి ఒక్కసారిగా ఉన్మాదిగా మారిపోయాడు. పోలీసుల ముందే సారా ప్యాకెట్ తాగి బూతులు తిట్టాడు.
బ్లేడుతో తన శరీరంపై గాట్లు పెట్టుకొని ఓ కానిస్టేబుల్ చొక్కా పట్టి దాడికి దిగాడు. స్థానిక యువకులు బ్లేడ్‌ను లాక్కొని కానిస్టేబుల్‌ను వాడి భారీ నుంచి విడిపించారు. ఇంతలో పెద్దగా అరుస్తూ పోలీసులపైకి దాడికి మళ్లీ దిగడంతో వారు అక్కడి నుంచి పరుగెత్తారు.
ఇంతలో ఆ యువకుడు గుడిసెలోకి చొరబడ్డాడు. స్థానికులు కర్రలు చేతబట్టుకొని బయటకు లాగి దేహశుద్ధి చేశారు. తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్‌ఐ రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్ రవీందర్ ఆ సైకోను ఆస్పత్రికి తరలించారు.

సైకో వీరంగం
హైదరాబాద్ నగరంలోని గుడిమాల్కాపూర్‌లో ఓ ఉన్మాది వీరంగం స్పష్టించాడు. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన అతన్ని పట్టుకున్న పోలీసులపైనే ఎదురుదాడికి దిగాడు.

సైకో వీరంగం
ఈ సంఘటన శుక్రవారం టప్పాఛబుత్ర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం గుడిమాల్కాపూర్ కూరగాయల మార్కెట్‌లో ఓ యువకుడు (25) ఉన్మాదిలా మారి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు.

సైకో వీరంగం
స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడికొచ్చిన టప్పాచబుత్ర పీఎస్‌కు చెందిన కానిస్టేబుళ్లు అతన్ని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా తాళ్లగడ్డ హనుమాన్ ఆలయం వద్ద వాహనంలో నుంచి బయటకు దూకాడు.

కారు ప్రమాదం
కారు నడుపుతున్న వ్యక్తి బ్రేక్‌కు బదులు ఎక్సలేటర్ తొక్కడంతో ఆగాల్సిన కారు మరింత వేగంతో దూసుకొచ్చింది.

కారు ప్రమాదం
రోడ్డుపక్కన ఉన్న జనాలు, వాహనాలపైకి వెళ్లింది. ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం
ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications