వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు.
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రతిపాదించగా అసెంబ్లీ ఏకగ్రీవంగా అమోదించింది. వాల్మీకి బోయలతో పాటు బేదర, కిరాతక, నిషాది, పెద్ద బోయ, బాట్ మదురాలు, చామర్ మదురాలను ఎస్టీలో చేర్చాలని గతంలో కేంద్రానికి లేఖ రాశామని సీఎం గుర్తు చేశారు.
కేంద్రానికి మరోసారి లేఖ రాస్తామన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని మాలి వర్గాన్ని కూడా ఎస్టీ జాబితాలో కలపాలని సీఎం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆసిఫాబాద్ తో పాటు ఆదివాసీ జిల్లాల్లో నివసిస్తున్న మాదిగలను కూడా ఎస్టీల్లో చేర్చాలన్న ప్రతిపాదనలు పరిశీలిస్తామన్నారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.













Click it and Unblock the Notifications