నోట్ల రద్దు ఎఫెక్ట్ : బ్యాంకు 'క్యూ'లో రిటైర్డ్ ఉద్యోగి మృతి

హైదరాబాద్ : కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తోంది. క్యూ లో గంటల తరబడి నిలబడలేక నానా అవస్థలు పడుతున్నారు. పనులన్ని మానుకుని బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లో నిలుచున్నా.. డబ్బులు దొరుకుతాయో లేదో తెలియని పరిస్థితి.

A retired employee was died in queue infront of bank

తాజాగా హైదరాబాద్ లోని మారేడుపల్లిలో ఆంధ్రా బ్యాంకు ముందు క్యూలో నిలుచున్న ఓ వ్యక్తి ఏకంగా తన ప్రాణాలే కోల్పోయాడు. చాలాసేపటి నుంచి క్యూలో వేచియున్న అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. మార్గమధ్యలోనే కన్నుమూశారు.

మృతుడిని మారేడుపల్లికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మీ నారాయణగా గుర్తించారు. నగదు మార్పిడి కోసం బ్యాంకుకు వచ్చిన ఆయన దాదాపు రెండు గంటలపాటు క్యూలో నిలబడినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+