Crime News: దండుమల్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రిక్షాను ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటో రిక్షాలో మొత్తం 12 మంది కూలీలు ప్రయాణిస్తున్నట్లు వారు తెలిపారు.

ఆటో డ్రైవర్
చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారానికి చెందిన పలువురు మహిళలు దండుమల్కాపురంలోని శ్వేతా తెలుగు ఫుడ్స్‌కు చెందిన పచ్చళ్ల పరిశ్రమలో పని చేస్తున్నారు. రోజు మాదిరిగానే ఆటో డ్రైవర్ కొండ వెంకటేశం మహిళా కూలీలను ఆటోలో ఎక్కించుకొని పరిశ్రమకు బయలుదేరాడు.పార్కు కూడలి వద్ద అదే పరిశ్రమకు చెందిన బస్సు అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి కూలీలను తీసుకొస్తూ
ఆటోను బలంగా ఢీకొట్టింది.

పల్టీలు
దీంతో ఆటో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలని ప్రయాణికులు డాకోజి నాగలక్ష్మి, సిలువేరు ధనలక్ష్మి, వరకాంతం అనసూయ, దేవరపల్లి శిరీష మృతి చెందారు. బుట్టి యామిని, కొండ కావ్య, కోయిగూర అఖిల, ఆటో డ్రైవర్ వెంకటేశం తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పదేళ్లలోపు పిల్లలు
కాగా మృతులు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని పరిశ్రమ ముందు దేవలమ్మనాగారం గ్రామ వాసులు ఆందోళన చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. కాగా ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరైన అనసూయ మినహా మిగిలిన వారందరికీ పదేళ్లలోపు పిల్లలు ఉన్నారు.












Click it and Unblock the Notifications