షాక్: డ్రైవింగ్ చేస్తూ నీలిచిత్రాలు చూస్తున్న ఆర్టీసీ డ్రైవర్, పట్టేశారిలా..
నావిగేషన్ కోసం ఇచ్చిన ట్యాబ్‌లను కొందరు ఆర్టీసీ డ్రైవర్లు దుర్వినియోగం చేస్తున్నట్లు ఈ ఘటన బట్టి తెలుస్తోంది.
జనగామ: నావిగేషన్ కోసం ఇచ్చిన ట్యాబ్‌లను కొందరు ఆర్టీసీ డ్రైవర్లు దుర్వినియోగం చేస్తున్నట్లు ఈ ఘటన బట్టి తెలుస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన మినీ వజ్ర బస్సులో ఓ డ్రైవర్ నీలిచిత్రాలు(బ్లూ ఫిల్మ్స్) చూస్తూ పట్టుబడ్డాడు. అది కూడా ప్రయాణికులతోపాటు కూడిన బస్సు నడుపుతూ కావడం గమనార్హం. ఇది గమనించిన నాగలింగం అనే ప్రయాణికుడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి నాగలింగం తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్-2 డిపోకు చెందిన టీఎస్03జెడ్ 0340 నెంబర్ గల వజ్ర బస్సు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి వెళ్తోంది. బస్సు స్టేషన్ ఘన్‌పూర్ దాటగానే ఒక్కసారిగా కుదుపుకు లోనయింది.

దీంతో అనుమానం వచ్చిన నాగలింగం డ్రైవర్‌కేసి చూడగా నావికేషన్ కోసం ఉపయోగిస్తున్న ట్యూబ్‌లో నీలి చిత్రాలు చూస్తున్నట్లు గమనించాడు. వెంటనే బస్సు ఆపి డ్రైవర్‌ను నిలదీశాడు. అయితే, డ్రైవర్ మాత్రం నాగలింగంనే బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో బస్సుతో సహా జనగామ డిపోకు తీసుకెళ్లి అధికారులకు ఫిర్యాదు చేశాడు నాగలింగం.
డ్రైవర్ బుకాయిస్తుండటంతో ట్యాబ్‌లోని యూట్యూబ్‌లో ఉన్న నీలి చిత్రాలకు సంబంధించిన వీడియోలను చూపించారు. నావిగేషన్ కోసం ఆర్టీసీ సంస్థ ట్యాబ్‌లు ఏర్పాటు చేస్తే నీలి చిత్రాల కోసం వాటుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగలింగం ఫిర్యాదు అందుకున్న హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్.. ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు. కాగా, డ్రైవర్‌పై తీసుకోవాలని నాగలింగం కోరారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications