నా గోస ఎవరికీ రావొద్దురో అయ్యో! అయ్యప్ప: నవ్వులు పూయిస్తున్న బుడ్డోడి వీడియో

హైదరాబాద్: సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని సందేశం ఇచ్చేవిగా, మరికొన్ని సంతోషాన్ని పంచేవిగా.. ఇంకొన్ని నవ్వులు పూయించేవిగా నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. తాజాగా, ఓ బుడ్డోడు స్కూల్‌కు వెళ్లేందుకు ఇష్టం లేక చేసిన పని ఇప్పుడు అందర్నీ నవ్విస్తోంది.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా చిన్న పిల్లలు చేసే అల్లరి పనులకు సంబంధించిన వీడియోలు సందడి చేస్తున్నాయి. కొందరు తమ పిల్లలు చేసే అల్లరిని వీడియోలు తీసి పోస్టు చేస్తుండగా.. మరికొందరు క్రియేట్ చేసి వీడియోలు పోస్టు చేస్తున్నారు.

A school child video viral: IPS Sumathi tweeted that video

తాజాగా, ఓ బుడ్డోడు తన తల్లి పాఠశాలకు పంపేందుకు ప్రయత్నిస్తుండగా తనకు పెద్ద కష్టం వచ్చిందంటూ కేకలు వేయడం అందర్నీ నవ్వులు పూయిస్తోంది. తనకు స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేకున్నా.. తన తల్లి బలవంతంగా తీసుకెళుతోందంటూ మారాం చేశాడు.

'వాయ్యో వాయ్యో రాయ్యో నాకొచ్చిన గోస ఎవరికీ రావొద్దురా అయ్యో.. అయ్యప్పా' అంటూ పిల్లోడు చిన్నగా ఏడుస్తూ వేసిన కేకలు నవ్వులు పూయిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో ఈ వీడియో వైరల్‌గా మారి సందడి చేస్తోంది. ఐపీఎస్ అధికారి సుమతి ఈ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ గోస ఎవరికీ రావొద్దురా అని కొందరు.. ఇప్పుడు గోసపడకపోతే.. భవిష్యత్తులో గోసపడాల్సి వస్తుందని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+