ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్ అధ్యక్షతన కమిటీ: ఆరుగురు సభ్యులు వీరే
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో తెలంగాణ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ కో-ఛైర్మన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిని ప్రభుత్వం నియమించింది.
ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని అంశాలపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

తెలంగాణ సర్కారుకు హైకోర్టులో ఊరట
విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి బకాయిల చెల్లింపుపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రూ. 261 కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేయడంతో తెలంగాణ డిస్కంలు విద్యుత్ కొనుగోలు బిడ్ లో పాల్గొనకుండా నేషనల్ డిస్పాచ సెంటర్ అడ్డుకుంది.
ఉదయం నుంచి విద్యుత్ కొనుగోలుబిడ్లు వేయకుండా పవర్ ఎక్చేజీలు నిలిపివేశాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన హైకోర్టు.. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్ బిడ్డింగ్ కు అనుమతించాలని ఎన్‌ఎల్‌డీసీని ఆదేశించింది. తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాత చేపడతామని వాయిదా వేసింది.
దీంతో విద్యుత్ కొనుగోలు బిడ్డింగ్ లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డంకి తొలగిపోయింది.












Click it and Unblock the Notifications