ఇన్ఫోసిస్ యువ టెక్కీ అదృశ్యం: హెచ్చరికలు వచ్చాయంటున్న తండ్రి

నగరంలో నివాసముంటున్న పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కనిపించకుండా పోయింది. ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన గీతారాణి(22) ఘట్‌

హైదరాబాద్: నగరంలో నివాసముంటున్న పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కనిపించకుండా పోయింది. ఘట్‌కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన గీతారాణి(22) ఘట్‌కేసర్‌ మండలం పోచారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇన్ఫోసిస్‌లో సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది.

సమీపంలోని సింగాపూర్‌ టౌన్‌షిప్‌లో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఏప్రిల్ 12 నుంచి కనిపించడం లేదని తండ్రి బల్‌భీర్‌సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు ఇతర రాష్ట్రాలకు చెందిన ఫోన్ నెంబర్ల నుంచి అరవింద్‌, అరుణ్‌ పేరిట తనకు ఫోన్‌ చేసి 'మీ కుమార్తె ప్రవర్తన సరిగా ఉండేలా చూడాలి' అంటూ హెచ్చరించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టామని సీఐ పేర్కొన్నారు.

A software engineer missing in Hyderabad

రైలు కిందపడి ప్రేమికుడి ఆత్మహత్య

తమ ప్రేమకు పెద్దలు అంగీకరించరనే భయంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. రైలు కింద పడి యువకుడు చనిపోగా, యువతి మాత్రం చివరి నిమిషంలో తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది.

కాచిగూడ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌లాల్‌ కథనం ప్రకారం... కార్వాన్‌ గుడిమల్కాపూర్‌నకు చెందిన రాజు(20) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా, గత కొంతకాలంగా ఓ ఇంటర్‌ విద్యార్థినిని ప్రేమిస్తున్నాడు. గురువారం సాయంత్రం ప్రేమికులిద్దరూ కలిసి ఓ హోటల్‌లో బిర్యానీ తిన్నారు.

తుండపల్లి స్టేషన్‌ వద్ద ఆత్మహత్య చేసుకునే క్రమంలో రైలు ఢీకొట్టడంతో రాజు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రేమికురాలు ఇచ్చిన సమాచారంతో స్థానికులు రాజును 108 వాహనంలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం అతను మృతి చెందాడు. మృతుడి తండ్రి మహేందర్‌ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+