పాదయాత్రలో విచిత్ర ఘటన.!మీటర్లు లేని ఇళ్లకు వేలల్లో కరెంటు బిల్లులు.!అవాక్కయిన భట్టి.!
అచ్చంపేట/హైదరాబాద్: పది ఏళ్ల పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న సర్కార్ చర్యలను సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఎండగట్టారు. కొర్రుతండ గ్రామస్తులు కొర్ర శంకర్, కేతావత్తు హనుమంతు నాయక్, బద్రు తదితరులు కలిసి తమ ఇండ్లకు కరెంటు కనెక్షన్ ఇచ్చి గత ఐదు సంవత్సరాలుగా మీటర్లు బిగించలేదని, కానీ ప్రతి మూడు నెలలకు ఒకసారి 10 నుంచి 12 వేల రూపాయల వరకు కరెంటు బిల్లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంట్లో ఉండే రెండు బల్బులు ఒక ఫ్యానుకు ఇంత బిల్లు వేస్తే తాము ఎట్లా కట్టాలి? తాము ఎట్లా బతకాలని? అని బోరున విలపించారు. కేతవతు హనుమంతు నాయక్, కొర్ర శంకర్ ఇద్దరు వారి ఇండ్లకు భట్టి విక్రమార్కని తీసుకువెళ్లి వాళ్ళు వాడుతున్న కరెంటు బల్బులు, ఫ్యాన్లను చూపించారు. మమ్మల్ని కరెంటు అధికారులు చాలా దోపిడీ చేస్తున్నారని ఇది కాకుండా విజిలెన్స్ అధికారుల మాదిరిగా వచ్చి మీటర్ లేదంటూ భారీ మొత్తంలో ఫైన్లు వేస్తున్నారని మొరపెట్టుకున్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ ఫర్ చేంజ్ పాదయాత్ర కు 81వ రోజు సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అచ్చంపేట మండలం చేదరుబావి తండా నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొర్రుతండా, ఐనోల్, శివారుతండా, బొమ్మనపల్లి, లక్ష్మీదేవి గండి, సిద్దాపూర్ గ్రామాల వరకు కొనసాగింది. దారి పొడవున సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు లంబాడ మహిళలు బంజారా సంస్కృతిలో పాటలు పాడుతూ ఆటలాడుతూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

లంబాడా మహిళల్లో ఉరకలేస్తున్న ఉత్సాహం పాదయాత్రలో జోష్ ను పెంచింది. పాదయాత్ర లంబాడ మహిళలతో కలిసి భట్టి విక్రమార్క స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇండ్లకు కరెంటు మీటర్లు బిగించకుండా వేలకు వేలు బిల్లులు వేస్తున్నారని కొర్రతండ గ్రామస్తుల ఆవేదనను అర్ధం చేసుకున్నట్టు, త్వరలో ఉన్నతాది కారులతో మాట్లాడి న్యాయం చేస్తానని వారికి భట్టి హామీ ఇచ్చారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications