హైదరాబాద్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్క దాడి (వీడియో)

హైదరాబాద్: నగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో చిన్నారులు, పెద్దలు గాయపడ్డారు. గతంలో ఓ బాలుడు కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీధుల వెంట వెళుతున్న చిన్నారులనేగాక.. ఇంటి ముందు ఆడుకుంటున్నవారిపైనా కుక్కలు దాడులు చేస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్ నగరంలోని సంతోష్ నగర్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

సంతోష్ నగర్ కాలనీలో ఇంటి ముందు నిలబడి ఉన్న ఐదేళ్ల బాలుడు అబ్దుల్ రఫీపై వీధి కుక్క విచక్షణా రహితంగా దాడి చేసింది. గమనించిన స్థానికులు కుక్కను తరిమివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు హుటాహుటిన బాలుడిని నారాయణగూడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

dog attacked

వీధి కుక్కలపై జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వీధి కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తాజా కుక్క దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి వెంటనే ఆగి ఆ కుక్కను తరిమివేయడంతో బాలుడు గాయాలతో బయటపడ్డాడు.

కాగా, ఇటీవల హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో ఒక్కసారిగా వీధిలో వెళుతున్న నాలుగేళ్ల బాలుడిపై దాడి చేశాయి. ఎవరూ లేకపోవడంతో విచక్షణారహితంగా అతడ్ని గాయపర్చాయి. దీంతో ఆ బాలుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తర్వాత జీహెచ్ఎంసీపై విమర్శలు రావడంతో అధికారులు పలు ప్రాంతాల్లో కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత కూడా కుక్కల దాడులు కొనసాగుతూనే ఉండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+