కొరియర్ బాయ్‌గా ఇంట్లోకి.. మహిళపై బెడ్‌షీట్ వేసి దోచేశాడు!
హైదరాబాద్: కొరియర్‌బాయ్‌గా వచ్చి మహిళ మెడలో గొలుసు లాక్కున్నాడు. కేకలు వేస్తుందేమోననే భయంతో ఆమె గొంతు పిసికే ప్రయత్నం చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని దుండిగల్ పోలీసులకు అప్పగించారు.
బాచుపల్లి కాసాని ప్రైమ్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్థు 309 ఫ్లాట్‌లో సుబ్రహ్మణ్యం, రాజమ్మ దంపతులు కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. సుబ్రహ్మణ్యం కెనడీ గ్లోబల్ స్కూల్‌లో పనిచేస్తున్నాడు.

భర్త సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లిన తర్వాత అదే ఫ్లోర్ 302లో నివసిస్తున్న శంకర్ అనే వ్యక్తి వారి ఇంటికెళ్లాడు. కొరియర్ బాయ్‌నని.. మీకు పార్శిల్ వచ్చిందని.. గుర్తింపుకార్డు చూపిస్తే ఇస్తానని రాజమ్మకు చెప్పాడు. గుర్తింపు కార్డు తీసుకురావటానికి ఆమె గదిలోకి వెళ్తుండగా.. అతడు వెనుకాలే వెళ్లి బెడ్‌షీట్ ఆమెపై కప్పి మెడలోని ఆరు తులాల పుస్తెల తాడు లాక్కున్నాడు.
గమనించిన కుమార్తె బయటకు వెళ్లి కేకలు వేయగా.. అక్కడే పనిచేస్తున్న కార్పెంటర్, అపార్ట్‌మెట్ వాసులు వచ్చి అతడిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications