ముంబైలో గెలుపు: మోడీకి మద్దతు, 2 మినహా మహారాష్ట్ర బీజేపీదే!
బృహన్ ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. గతంలో 31 స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు ఏకంగా 81 స్థానాలకు ఎగబాకింది. అద్భుత విజయంతో బీజేపీ సంబరాలు చేసుకుంటోంది.
ముంబై: బృహన్ ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. గతంలో 31 స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు ఏకంగా 81 స్థానాలకు ఎగబాకింది. అద్భుత విజయంతో బీజేపీ సంబరాలు చేసుకుంటోంది.
ఈ విజయం పైన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. పారదర్శక పాలనకు ప్రజలు ఓటేశారని చెప్పారు. తమ విజయం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజల మద్దతు తేటతెల్లమవుతోందని చెప్పారు.

ప్రధాని మార్గదర్శకత్వంలో..
ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకంలో పని చేసి తాము ముంబైలో గెలుపొందామని చెప్పారు. బీజేపీకి మద్దతు పలికినందుకు ముంబై, మహారాష్ట్ర ప్రజలకు ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు.

మోడీకి ప్రజల మద్దతు
ఈ గెలుపు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజల మద్దతుకు నిదర్శనం అని ఫడ్నవీస్ అన్నారు. బీఎంసీలో 227 స్థానాలు ఉన్నాయి. బీజేపీ - శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. బీజేపీ 81 స్థానాలు, శివసేన 84 స్థానాలు గెలుచుకుంది.

కాంగ్రెస్‌కు షాక్
కాంగ్రెస్ పార్టీ కేవలం 31 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ కేవలం 9 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) 9 స్థానాల్లోనూ, ఇతరులు 14 స్థానాల్లోనూ గెలుపొందారు.

బీజేపీదే బృహన్ ముంబై
స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో బీఎంసీని బీజేపీనే పాలిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రావ్ సాహెబ్ దన్వే అన్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులు తమ వైపు ఉన్నారని, తుది ఫలితాలు క్లియర్ అయ్యాక అంతా తేలిపోతుందన్నారు.

రెండు మినహా
మహారాష్ట్రలో ముంబై, థానే మినహా ఎనిమిది మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకుంది. ముంబైలో 81 సీట్లతో సత్తా చాటినప్పటికీ.. మేజిక్ ఫిగర్ 114 ఎవరికీ రాలేదు.పుణే, నాగపూర్, నాసిక్, ఉల్లాస్ నగర్, షోలా, అఖోలా, అమరావతి, పింప్రి మున్సిపాలిటీలని బీజేపీ కైవసం చేసుకుంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications