Viral Video: నీకు భూమి మీద నూకలున్నాయి నాయనా.. వీడియో వైరల్..

అదృష్టం అంటే అతనిదే.. చావు చివర అంచుల వరకు వెళ్లి బతికి బయటపడ్డాడు. రైలు ప్రమాదం నుంచి గాయాలతో తప్పించుకున్నాడు. అందురూ అతని పని అయిపోయిందనుకున్నారు. కానీ అతనికి భూమిపై నూకలు ఉండడంతో బతికాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోయి రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య చిక్కుకున్నాడు. అయితే అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం వికారాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ రైలు అప్పుడే స్టార్ట్ అయి బయల్దేరింది. ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ మిస్ అయి రైలు, ప్లాట్‌ఫారమ్‌ల మధ్య జారిపడ్డాడు. అతన్ని రైలు అట్లనే ముందుకు ఈడ్చుకెళ్లింది. అప్రమత్తమైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్), ప్రయాణికులు, రైల్వే అధికారులు రైలును ఆపారు.

A video of a person trapped between a train and a platform is going viral on social media

రైలును నిలిపివేసిన తర్వాత,వ్యక్తిని రక్షించడానికి ప్లాట్‌ఫారమ్‌లోని కొంత భాగాన్ని బద్దలు కొట్టాల్సి వచ్చింది. అనంతరం బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బీదర్‌ నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్తున్న రైలు దాదాపు 90 నిమిషాలు ఆలస్యమైంది. మనం రైళ్లల్లో ప్రయాణిస్తున్నప్పుడు కావొచ్చు.. రైల్వే స్టేషన్ కు వెళ్లినప్పుడు కావొచ్చు.. రైల్వే అధికారులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంటారు. రన్నింగ్ లో ట్రైన్ ఎక్కవద్ద అంటూ పదే పదే చెబుతుంటారు.

అలాగే రైలు ఆగిన తర్వాతే ఎక్కాలను కోరుతారు. రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు డోర్ వద్ద బయటకు కాళ్లు పెట్టుకుని కూర్చోవద్దని చెబుతారు. అయితే అధికారులు అంతా చెప్పినా మనం మాత్రం పట్టించుకోము. మనం చేసే పని చేసుకుంటూ పోతాం. ఇప్పటికైనా రైలు ఎక్కటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+