అబిడ్స్‌లో హోటల్‌పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
అబిడ్స్ ప్యాలెస్ హోటల్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. హోటల్ భవనంపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని అబిడ్స్ ప్యాలెస్ హోటల్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. హోటల్ భవనంపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న మహిళను అలంక్రిత(32)గా పోలీసులు గుర్తించారు. మహిళ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇద్దరి ప్రాణాలు తీసిన అతివేగం
అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. నార్సింగి రాయల్ ఫంక్షన్‌హాల్ సమీపంలో చోటు చేసుకుందీ ఘటన. నార్సింగి ఎస్‌ఐ విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకి హకీంపేటకు చెందిన ఒసామా(18) విద్యార్థి.
ఇతను తమ మెడికల్ షాపులో పనిచేసే మహ్మద్ షాహబాజ్(18), మహ్మద్ ఇర్ఫాన్(22)లతో కలిసి శుక్రవారం ఉదయం గండిపేటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఐ20 కారు అతివేగంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఎదురుగా మెహిదీపట్నం నుంచి గండిపేట వైపు వస్తున్న ఎంజీఐటీ బస్సును ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన సమయంలో కారును ఒసామా నడిపిస్తున్నాడు. డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న షాహబాజ్ తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందగా, వెనక సీటులో కూర్చున్న మహ్మద్ ఇర్ఫాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఒసామా కాళ్లు విరిగి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఎంజీఐటీ బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications