వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య(పిక్చర్స్)
హైదరాబాద్: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం భోలక్‌పూర్ రంగానగర్‌కు చెందిన జ్యోతి(24) అదే ప్రాంతానికి చెందిన శివలు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
కాగా, పెళ్లైన కొత్తలో బాగానే ఉన్న శివ కొన్ని నెలల తర్వాత పుట్టింటికి వెళ్లి కట్నం తీసుకురావాల్సిందిగా జ్యోతిపై ఒత్తిడి చేశాడు. దీంతో ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిన జ్యోతి తన భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని చెప్పి విలపించింది. దీంతో కూతురు పరిస్థితి చూడలేక తల్లిదండ్రులు ప్రభాకర్, రాణిలు కొంత నగదును ముట్టజెప్పారు. అయితే సంతృప్తి చెందని అతను రోజు పలు రకాలుగా వేధించసాగాడు.
ఇదే క్రమంలో బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ కాగా, తీవ్ర మనస్తాపం చెందిన జ్యోతి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త శివ తన భార్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేయగా, అత్తామామలు తమ కూతురిని అల్లుడే కొట్టి చంపాడని ఫిర్యాదు చేశారు.
జ్యోతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అల్లుడే కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ, ఆత్మహత్యా? లేక హత్యా? అనేది తేలుతుందని ముషీరాబాద్ పోలీసులు తెలిపారు.

వివాహిత ఆత్మహత్య
భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

మృతురాలు(ఫైల్ ఫొటో)
పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. భోలక్‌పూర్ రంగానగర్‌కు చెందిన జ్యోతి(24) అదే ప్రాంతానికి చెందిన శివలు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

వివాహిత ఆత్మహత్య
కాగా, పెళ్లైన కొత్తలో బాగానే ఉన్న శివ కొన్ని నెలల తర్వాత పుట్టింటికి వెళ్లి కట్నం తీసుకురావాల్సిందిగా జ్యోతిపై ఒత్తిడి చేశాడు. దీంతో ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిన జ్యోతి తన భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని చెప్పి విలపించింది.

వివాహిత ఆత్మహత్య
దీంతో కూతురు పరిస్థితి చూడలేక తల్లిదండ్రులు ప్రభాకర్, రాణిలు కొంత నగదును ముట్టజెప్పారు. అయితే సంతృప్తి చెందని అతను రోజు పలు రకాలుగా వేధించసాగాడు.












Click it and Unblock the Notifications