వివాహేతర బంధం: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య
ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్ శివారు రాంపూర్ రైల్వే ట్రాక్ పరిధిలో ఏప్రిల్ 15న అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి సంఘటనను స్థానిక పోలీసులు ఛేదించారు.
వరంగల్: ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్ శివారు రాంపూర్ రైల్వే ట్రాక్ పరిధిలో ఏప్రిల్ 15న అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి సంఘటనను స్థానిక పోలీసులు ఛేదించారు. ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీలక్ష్మి ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ బాలసముద్రం నరసింహారెడ్డి కాంప్లెక్స్‌లో ఉండే ఎర్ర రమణారెడ్డి(42) అనే వ్యక్తిని ఆయన భార్య అన్నపూర్ణ ప్రియుడు మేక ఇంద్రారెడ్డితో కలిసి గత 15న రాత్రి రాంపూర్ శివారులోని జీవధార చర్చి సమీపంలో హత్య చేయించింది.
ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఎర్ర రమణారెడ్డి, అన్నపూర్ణ భార్యాభర్తలు. వీరిద్ధరిమధ్య తరుచు ఘర్షణలు చోటుచేసుకునేవి. వరంగల్ హంటర్‌రోడ్‌కు చెందిన మేక ఇంద్రారెడ్డి, ఎర్ర రమణారెడ్డి ఇద్దరు స్నేహితులు. రమణారెడ్డి అన్నపూర్ణకు మధ్య ఏర్పడే వివాదాలపై ఇంద్రారెడ్డి పలుమార్లు సర్ది చెబుతూ వచ్చాడు.
ఇదే క్రమంలో అన్నపూర్ణకు ఇంద్రారెడ్డి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. రమణారెడ్డికి ఇంద్రారెడ్డి రూ.10 లక్షల అప్పు ఉన్నాడు. ఆ డబ్బుల విషయంలో రమణారెడ్డి ఇంద్రారెడ్డి మధ్య కూడా ఘర్షణలు జరుగుతుండేవి. అయినా వీరు మాట్లాడుకునేవారు. అన్నపూర్ణ, ఇంద్రారెడ్డి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న రమణారెడ్డిని అడ్డు తొలగించాలనుకున్నారు.

అందులో భాగంగానే గత నెల 15న రాత్రి మేక ఇంద్రారెడ్డి తనకు సహకారంగా హన్మకొండలోని లష్కర్‌బజార్‌కు చెందిన సిలువేరు గణేష్(25), ఎస్‌ఆర్‌ఆర్ తోట వరంగల్‌కు చెందిన ఎరుపల్లి సందీప్(24) అను ఇద్దరితోపాటు రమణారెడ్డిని కూడా పార్టీ ఇస్తామని చెప్పి రాంపూర్‌కు తీసుకెళ్లారు. రాంపూర్‌లో మద్యాన్ని అతిగా తాగించి ఆపై రాంపూర్ శివారులోని జీవధార చర్చి వెనుకాల ఖాళీ ప్రదేశంలో రాడ్‌తో అతన్ని తలపై చితకబాది హత్యచేశారు.
మృతిచెందిన అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి రైల్వేట్రాక్‌పై పడేశారు.దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేపట్టి విషయాన్ని ఛేదించారు. రమణారెడ్డిని హత్య చేసిన ఇంద్రారెడ్డి, గణేష్, సందీప్‌ను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు తెలిపారు. హత్యకు ప్రణాళిక చేసిన అన్నపూర్ణ పరారీలో ఉన్నట్లు సీఐ శ్రీలక్ష్మి తెలిపారు.












Click it and Unblock the Notifications