లైంగిక వాంఛ తీర్చాలంటూ కన్న కూతురికి వేధింపులు: భర్తను చంపేసిన భార్య, కూతురు
కరీంనగర్: కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి కన్నకూతురిపై కన్నేశాడు. తన లైంగిక వాంఛ తీర్చాలని వేధించాడు. ఆ దుర్మార్గుడి వేధింపులు భరించలేక.. విధిలేని పరిస్థితుల్లో అతడి భార్య, కూతురుతో కలిసి అతడిని హతమార్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్‌లో ఆదివారం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కమలాపూర్ మండలం కన్నూర్‌కు చెందిన రావుల సంపత్.. నర్సింగాపూర్‌లోని అత్తగారింటికి పదేళ్ల క్రితం కుటుంబంతో సహా వచ్చాడు. సంపత్‌కు భార్య తిరుపతమ్మ, కూతురు(16), కుమారుడు వంశీ ఉన్నారు. సంపత్, తిరుపతమ్మ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

కూతురు ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. ఇప్పుడు పరీక్షలు రాస్తోంది. కాగా, మద్యానికి బానిసైన సంపత్ కన్ను కన్నకూతురుపై పడింది. తన లైంగిక వాంఛ తీర్చమంటూ ఐదు నెలలుగా కూతురును వేధింపులకు గురిచేస్తున్నాడు.
శనివారం రాత్రి బాగా మద్యం తాగి వచ్చిన అతడు కూతురును కోరిక తీర్చమంటూ వేధించాడు. ఇది తట్టుకోలేక సంపత్ భార్య తిరుపతమ్మ, ఆమె సోదరి లక్ష్మి, కూతురు కలిసి సంపత్‌ను ఇంటి ముందు కర్రకు కట్టేసి రోకలిబండతో చితకబాదారు. తీవ్ర రక్తస్రావంతో సంపత్ ఆదివారం ఉదయం మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications