వివాహితతో అక్రమ సంబంధం: పెళ్లాడమన్నందుకే రేప్ చేసి, ఉరేశాడు
కరీంనగర్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వివాహితతో అక్రమ సంబంధం నెరుపుతున్న ఓ యువకుడు.. పెళ్లి చేసుకోవాలని కోరినందుకు ఆమెను దారుణంగా హత్య చేశాడు.
జూలై 24న అగ్రహారం శివారు ప్రాంతంలో గౌడ కల్ప న(28)పై లైంగికదాడి, ఆపై హత్య చేశాడు.
సిరిసిల్ల డీఎస్పీ సుధాకర్ సోమవారం మీడియా సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తంగళపల్లి గ్రామానికి చెందిన గౌడ కల్పన(28)కు శ్రీనివాస్‌తో వివాహమైంది. కొంతకాలంగా భర్తతో విభేదాలు రావడంతో, అతడ్ని వదిలేసి ఒంటరిగా పిల్లలతో సిరిసిల్లలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది కల్పన.

కాగా, సిరిసిల్ల పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన ఆకుబత్తిని శ్రీకాంత్(21)తో ఆమె వివాహేతేర సంబంధాన్ని ఏర్పరచుకుంది. వ్యవహారం తెలుసుకున్న ఇంటి యజమానులు ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించారు. ఇక తనను పెళ్లి చేసుకోవాలనీ, లేకుంటే ఇంటికి వచ్చి ఉంటానంటూ శ్రీకాంత్‌ను హెచ్చరించింది కల్పన.
ఈ క్రమంలో ఎలాగైనా వదలించుకోవాలనుకున్న శ్రీకాంత్.. ఆమెకు మాయమాటలు చెప్పి.. వేములవాడ అగ్రహా రం వరకు తీసుకొచ్చి అత్యాచారా చేశాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న తాడుతో ఉరేసి చంపేశాడు.
పెళ్లి మాట ఎత్తినందునే ఎలాగైనా వదలించుకోవాలనే ఉద్దేశంతోనే శ్రీకాంత్ ఈ హత్యకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, హత్యకు ఉపయోగించిన తాడును కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుడ్ని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications