మహిళ దారుణ హత్య: యాసిడ్ పోసి తగలబెట్టారు

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం బ్రహ్మాణపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని మహిళను దారుణంగా హత్యచేసి ఆపై యాసిడ్‌ పోసి తగలబెట్టారు. గ్రామానికి సమీపంలో ఉన్న చంద్రవాగు బ్రిడ్జి కింద సగం కాలిన శరీరాన్ని చూసిన కొందరు స్థానికులు బుధవారం పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలంలో యాసిడ్ ఆనవాళ్లు ఉండటంతో యాసిడ్‌పోసి తగలపెట్టారని పోలీసులు నుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గుండెపోటుతో డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ మృతి

A woman allegedly murdered in Mahabubnagar district

దక్షిణ మధ్య రైల్వే ట్రాక్ 2 డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస రావు రైల్వే క్వార్టర్స్‌లో బుధవారం మృతి చెందారు. గుండెపోటుతో మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రైల్ నిలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు.

రైల్వే లాన్సర్ కాలనీలోని 605/4 లో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ స్వస్థలం గుంటూరు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు శ్రీనివాస్ భార్యకు సమాచారం అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+