KTR: మహిళా ట్వీట్‍కు స్పందించిన కేటీఆర్.. డీజీపీకి ఏం చెప్పారంటే..!
మహిళల కోసం ఆటోలు నడపాలని కేటీఆర్ డీజీపీని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే, బస్ స్టేషన్లలో మహిళలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం రాష్ట్ర పోలీసులను కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు మహిళలకు సురక్షితమైన రవాణా సౌకర్యం అందించాలని హర్షిత అనే మహిళ కేటీఆర్ కు ట్వీట్ చేసింది. ప్రజా రవాణా, మెట్రో అందుబాటులోని మహిళలకు భద్రతగా రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు.
"గౌరవనీయులైన కేటీఆర్ మహిళలకు బహుమతిగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట ఉన్న మహిళలకు సురక్షితమైన రవాణా (క్యాబ్/ఆటో) అందించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దీనిని పోలీసులు/ఏదైనా ప్రభుత్వ అధికార యంత్రాంగం 10PM నుంచి 5AM వరకు పబ్లిక్ రవాణా సమయంలో ఏర్పాటు చేయాలి. ఈ సమయంలో మెట్రో అందుబాటులో ఉండదు' అని ఆమె ట్వీట్ చేశారు.

మహిళ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని ట్యాగ్ చేస్తూ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. ఈ ఆలోచనను ముందుకు తెచ్చినందుకు ట్విట్టర్ యూజర్‌కు ధన్యవాదాలు కూడా తెలిపారు. "దీనిని వీలైనంత త్వరగా పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ డీజీపీని అభ్యర్థిస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే, బస్ స్టేషన్లలో ఇటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయండి. మీ సూచనకు ధన్యవాదాలు హర్షిత గారూ" అని కేటీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.
Request @TelanganaDGP to consider this at the earliest and institute such mechanism at all Railway and Bus stations across the state
— KTR (@KTRBRS) March 10, 2023
Thank You Harshitha Garu for your suggestion https://t.co/KwBqJ1krXq
మంత్రి ట్వీట్‌పై తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ స్పందిస్తూ, ఆలోచనను అమలు చేయడానికి సాధ్యమైన మార్గాలను అన్వేషిస్తానని హామీ ఇచ్చారు. "తప్పకుండా సార్. ట్రాకింగ్ మెకానిజంతో పాటు మహిళలకు సురక్షితమైన రవాణాను అందించడానికి ఇది గొప్ప చొరవ అవుతుంది. దీన్ని అమలు చేసేందుకు సాధ్యమైన మార్గాలను అన్వేషిస్తాం" అని డీజీపీ ట్వీట్ చేశారు.
👍 Thank You DGP Garu https://t.co/Ghg85WPu1D
— KTR (@KTRBRS) March 10, 2023
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications