ప్రేమ విఫలం: యువ టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమలో విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాంనగర్‌లో నివాసముండే బాలాజీ ప్రతాప్ అనే యువకుడు ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. కాగా, గత కొంత కాలంగా బాలాజీ.. ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే, ఆ యువతి మాత్రం ఇతడ్ని ప్రేమించలేదు.

తన ప్రేమను అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన బాలాజీ.. ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. బాలాజీ ఆత్మహత్య విషయంపై స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications