మిస్ వరల్డ్ పోటీల్లో వాళ్లతో పడుకోమంటున్నారు..యువతి సంచలన వీడియో లీక్

మిస్ వరల్డ్ పోటీలు -2025 హైదరాబాద్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ అందాల పోటీలను నిర్వహిస్తున్నారు.పాక్‌తో ఇండియా యుద్ధానికి దిగిన సమయంలో కూడా మిస్ వరల్డ్ పోటీలు -2025 నిర్వహించడానికే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపించింది. ఈ పోటీలను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి హైదరాబాద్ బ్రాండ్‌ను మరింత పెంచుకోవాలని ప్రభుత్వం భావించింది.

అయితే మిస్ వరల్డ్ పోటీలు చివరి దశకు చేరుకున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఈ పోటీల నుంచి బ్రిటన్‌కు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్ మిల్లా మాగీ పోటీ నుంచి తప్పుకున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో తనని వేశ్యలాగా చూస్తున్నారని చెప్పి ఆమె ఈ పోటీల నుంచి తప్పుకున్నారు. ఈ వివాదం ముగియక ముందే ఓ యువతి అసలు మిస్ వరల్డ్ పోటీల్లో ఏం జరుగుతుందో చెప్పిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ అందాల పోటీల వెనుక ఉన్న చీకటి కోణాలను ఓ యువతి ఇటీవల వెల్లడించింది.

A young woman exposes the dark side of the Miss World pageant

ఈ పోటీలలో పైకి కనిపించేదానికి, లోపల జరిగే దానికి చాలా తేడా ఉంటుందని ఆమె వివరించింది.మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ అందాల పోటీల వెనుక ఉన్న చీకటి కోణాలను ఓ యువతి ఇటీవల వెల్లడించింది. ఈ పోటీలలో పైకి కనిపించేదానికి, లోపల జరిగే దానికి చాలా తేడా ఉంటుందని ఆమె వివరించింది.

ఆ యువతి చెప్పిన దాని ప్రకారం, మిస్ వరల్డ్ పోటీల ఫ్రాంచైజీ దక్కినప్పుడే అసలు ఆట మొదలవుతుందట. పోటీదారులను ఆహ్వానించి, ఒక నిర్దిష్ట అర్హత ప్రమాణాన్నిసెట్ చేస్తారు. అది దాటిన వారు పోటీకి అర్హత సాధిస్తారు. ఆ తర్వాత, ఈ అందగత్తెలు కొన్ని బ్రాండ్లను సంప్రదించి, అవి అంగీకరిస్తే, ఆ బ్రాండ్లే వారి ఖర్చులను భరిస్తాయి. ఇదంతా పైకి కనిపించే విషయమే.

అయితే, లోపల మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆ యువతి ఆరోపించింది. "కిరీటం దక్కాలంటే పడుకోవాలి... టైటిల్ కావాలంటే కన్సిడర్ చేయాలి" అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే వాస్తవం (రియాలిటీ) అని ఆమె నొక్కి చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. అయితే ఈ యువతి చేసిన ఆరోపణలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

కొందరు ఆమె మాటలను సమర్థిస్తూ, అందాల పోటీలలో ఇలాంటి చీకటి కోణాలు ఉంటాయని తాము కూడా విన్నామని చెబుతున్నారు. మరికొందరు మాత్రం, "ఇదంతా ఓ లూజర్ చెప్పే మాట" అంటూ ఆమె వాదనను కొట్టిపారేస్తున్నారు. ఓడిపోయిన వారు తమ నిరాశను ఇలా బయటపెడతారని విమర్శిస్తున్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు అందాల పోటీల పారదర్శకతపై మరోసారి చర్చకు దారితీశాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+