డీసీపీ ఆఫీస్ సమీపంలో పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని నార్త్ జోన్ డీసీపీ కార్యాలయం సమీపంలో ఓ యువకుడు నిప్పంటించుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు.

హైదరాబాద్: నగరంలోని నార్త్ జోన్ డీసీపీ కార్యాలయం సమీపంలో ఓ యువకుడు నిప్పంటించుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. డీసీపీ కార్యాలయానికి సమీపంలోని చర్చి బిషప్ ఇంటి గేటు ముందు శనివారం ఉదయం ఆ యువకుడి మృతదేహం పడివుంది.

సమాచారం అందుకున్న పోలీసులు.. క్లూస్ టీంతో రంగంలోకి దిగారు. చర్చి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. తీవ్రంగా కాలిన గాయాలతో యువకుడు అక్కడికి వచ్చి చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద రెండు పెట్రోల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

A youth allegedly committed suicide near to DCP Office

అయితే, ఆ యువకుడే ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారా? అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖంతోపాటు శరీరం బాగా కాలిపోయి ఉండటంతో యువకుడిని గుర్తుపట్టే అవకాశం లేకుండా పోయింది. పోలీసుల దర్యాప్తు అనంతరం అసలు విషయం వెలుగుచూసే అవకాశం ఉంది.

కాగా, సమీపంలోని పెట్రోల్ బంకులో బాటిళ్లలో పెట్రోలును కొనుగోలు చేసిన బాధితుడి వీడియోలు పోలీసులు సేకరించారు. అతడు నగరానికి చెందిన వ్యక్తి కాదని పోలీసులు చెబుతున్నారు. పెట్రోల్ బంకు సిబ్బందిని కూడా ప్రశ్నించనున్నారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+