‘12ఏళ్లుగా ప్రేమించి.. పెళ్లికి కులం తక్కువన్నాడు’
హైదరాబాద్: ఓ యువతీ, యువకుడు ప్రేమించుకన్నారు. పెళ్లి చేసుకుందామని కూడా నిర్ణయించుకున్నారు. చివరకు, ఆ అమ్మాయి కులం తక్కువ అని ముఖం చాటేశాడు ప్రేమించిన యువకుడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది.
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌కి చెందిన వెంకటేష్(30) అదే గ్రామానికి చెందిన యువతి(28)ని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని 12 ఏళ్లుగా కలిసి తిరిగాడు.

వెంకటేష్ తనను పెళ్లి చేసుకోకుండా ఎప్పుడూ దాటవేస్తుండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. అంతేగాక, వేరే యువతితో పెళ్లికి సిద్ధమవుతున్నాడని, బుధవారం నిశ్చితార్థమని తెలుసుకున్న యువతి అతని ఇంటికి వెళ్లి నిలదీసింది. దీంతో 'నీది తక్కువ కులం.. నిన్ను పెళ్లి చేసుకోను' అని సదరు యువకుడు ఆమెతో చెప్పేశాడు.
ఈ నేపథ్యంలో బాధిత యువతి వెంకటేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications