తల్లితో అక్రమ బంధం! కూతురికి లైంగిక వేధింపులు: చివరకు యువకుడి ప్రాణం తీసింది
హైదరాబాద్: వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. చివరకు ప్రాణాలు కూడా తీస్తున్నాయి. అయినా సమాజంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణం తీసింది.

వివాహితతో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ అల్లాపూర్‌కు చెందిన అజయ్(30) మాదాపూర్‌లోని ఓ కాలేజీలో అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అంతేగాక, ఎస్సార్‌నగర్‌లో ఓ ప్రైవేటు హాస్టల్ నిర్వహిస్తున్నాడు. కాగా, మూసాపేటకు చెందిన ఓ వివాహితతో అతనికి అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆమె కూతురికి లైంగిక వేధింపులతో..
ఆ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఆమె కూతురుపైనా కన్నేశాడు. ఆమెను లైంగిక వేధింపులకు దిగాడు. దీంతో సదరు మహిళ అతనితో గొడవకు దిగింది. ఈ క్రమంలోనే మహిళ బంధువులకు ఈ విషయం తెలియడంతో.. వారు శుక్రవారం మధ్యాహ్నం అజయ్ నివాసానికి వెళ్లి అతడ్ని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత అతడ్ని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. అయితే, మహిళ బంధువుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ అజయ్.. ఊపిరికూడా తీసుకోలేని స్థితిలో ఉండటాన్ని గమనించిన పోలీసులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు.

చివరకు ప్రాణం వదిలాడు
గాంధీ ఆస్పత్రిలో వైద్యులు అతడికి చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం అజయ్ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అజయ్ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. సదరు మహిళ బంధువులు దారుణంగా వ్యవహరించారని, తప్పు చేశాడని భావిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాగుండేదని, ఇలా కొట్టి ప్రాణాలు తీస్తారా? అని స్థానికులు మండిపడుతున్నారు. అజయ్ మృతికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరుతున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా జీవితాలు నాశనమవుతాయని తెలిసినా.. తప్పటగులు వేసే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications