‘ప్రేమ దక్కని లోకంలో ఉండలేను.. క్షమించమ్మా’: ఎంబిఏ విద్యార్థి అదృశ్యం
హైదరాబాద్: 'అమ్మా... నన్ను క్షమించు, నాకు ప్రేమ దక్కని ఈ లోకంలో ఉండలేను.. అందుకే వెళ్లిపోతున్నా. క్షమించు' అంటూ ఓ ఎంబిఏ విద్యార్థి తన తల్లి ఫోన్‌కు ఎస్సెమ్మెస్ పంపి అదృశ్యమయ్యాడు. దీంతో ఆందోళనకు గురైన అతడి తల్లి రెండు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా రోదిస్తూ కుప్పకూలిపోయింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెం.2లోని ఇందిరానగర్‌లో నివసించే శ్రీకాంత్(25) ఎంబీఏ చదువుతున్నాడు. స్థానికంగా ఉంటున్న ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థినిని ఏడాది కాలంగా ప్రేమిస్తున్నాడు.
నాలుగు రోజుల క్రితం తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పగా తిరస్కరించింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ శనివారం రాత్రి ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. 'ప్రేమలో ఓడిపోయా.. ఆత్మహత్య చేసుకుంటున్నా' అని గంట తర్వాత తన తల్లికి ఎస్సెమ్మెస్ పంపాడు.

దీంతో ఆందోళనకు గురైన తల్లి వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీకాంత్ ఫోన్ నెంబర్‌ను ట్రాక్ చేయగా చిలకలగూడ ప్రాంతంలోని రైలు పట్టాల వద్ద ఉన్న టవర్ లొకేషన్ చూపించింది.
వెంటనే పోలీసులు, కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి పట్టాల వద్ద రాత్రంతా గాలించినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత శ్రీకాంత్ సిద్దిపేట ప్రాంతంలో ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. దీంతో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి శ్రీకాంత్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications