దారుణం: మతిస్థిమితంలేని యువకుడిపై నలుగురు యువకులు లైంగిక దాడి
ఖమ్మం: జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాక శివారులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పశువులు కాసేందుకు వెళ్లిన స్థానిక యువకుడిపై నలుగురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు.
ఘటనకు సంబంధించిన వివరాలను ఆదివారం బూర్గంపాడు ఠాణాలో ఎస్సై కరుణాకర్ వెల్లడించారు. మండలంలోని తాళ్లగొమ్మూరుకు చెందిన 22 సంవత్సరాల ఓ యువకుడికి మతిస్థిమితం లేదు. అమాయకుడైన అతను పశువులు కాసేందుకు పక్కనే ఉన్న అటవీప్రాంతంలోకి రోజూ వెళ్లివస్తుంటాడు.

ఈ నేపథ్యంలో శనివారం రాజుతండాకు చెందిన ఆటో డ్రైవర్ నూనావత్ బాలు, అతని సహచరులు కుమార్, వెంకటేశ్వర్లు, బాలకృష్ణలతో కలిసి అతనిపై లైంగికదాడి చేశారు. ఆటోలో ఆ యువకుడిని తీసుకొచ్చిన నలుగురు నిందితులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఎస్సై తెలిపారు.
బాధితుడి తల్లి ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఆయన తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications