ప్రేమ పెళ్లి: గర్భవతిని చేసి ముఖం చాటేశాడు: సినీనటి ఫిర్యాదు
ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమెకు మాయమాటలు చెప్పి వివాహం కూడా చేసుకున్నాడు. కొద్ది రోజులపాటు కాపురం చేసి, ఆమె గర్భవతి అని తెలియడంతో ముఖం చాటేశాడు.
హైదరాబాద్: ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమెకు మాయమాటలు చెప్పి వివాహం కూడా చేసుకున్నాడు. కొద్ది రోజులపాటు కాపురం చేసి, ఆమె గర్భవతి అని తెలియడంతో ముఖం చాటేశాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. సినీనటి, డబ్బింగ్ ఆర్టిస్టైన ఆ బాధితురాలు ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
జూబ్లీహిల్స్ ఎస్సై కురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరుకు చెందిన మేడ యశ్వంత్‌కుమార్(26) బీటెక్ పూర్తి చేసి నగరానికి వచ్చాడు. ప్రస్తుతం మియాపూర్ హైదర్‌నగర్ సమీపంలోని గుడిసెల్లో ఉంటున్నాడు. అంతకుముందు రహ్మత్‌నగర్ ఉండేవాడు.

ఆ సమయంలో స్థానికంగా ఉండే సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేసే 23ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లికూడా చేసుకుంటానని చెప్పి ఆమె మెడలో ఓ పసుపుతాడు కట్డాడు. కొద్దిరోజులు కాపురం కూడా చేశాడు. ఈ క్రమంలో ఆమె గర్భందాల్చింది. దీంతో పెద్దల ముందు తనను పెళ్లి చేసుకోవాలంటూ కోరింది.
కాగా, ఆ తర్వాత నుంచి యశ్వంత్‌కుమార్ ఆమెకు దూరంగా ఉంటూ, మొబైల్ ఫోన్లోనూ అందుబాటులోకి రావడం లేదు. దీంతో బాధితురాలు మార్చి 3న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పలు కేసులు నమోదు చేశారు. గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై తెలిపారు.












Click it and Unblock the Notifications