నయవంచకుడు: అమ్మాయిల పేర్లతో స్నేహం, యూట్యూబ్‌లో నగ్న చిత్రాలు
హైదరాబాద్: ఓ నయవంచకుడి ఆటను కట్టించారు పోలీసులు. అమ్మాయిల పేర్లతో ఫేస్‌బుక్ ఖాతాలను ప్రారంభించి విద్యార్థులు, యువతులను పరిచయం చేసుకుని వారి ఫొటోలు, నగ్నచిత్రాలను యూట్యూబ్‌లో ఉంచుతానంటూ బెదిరిస్తున్న అబ్దుల్ మాజిద్ అనే యువకుడ్ని సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
సంయుక్త కమిషనర్ క్రైం టి ప్రభాకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బంజారాహిల్స్‌లో ఉంటున్న మాజిద్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

వృష్టి సమాల్, నేరా విరాణి పేర్లతో ఫేస్‌బుక్‌లో ఖాతాలు ప్రారంభించి పదోతరగతి, ఇంటర్, ఇంజినీరింగ్ చదివే విద్యార్థినులతో పరిచయాలు పెంచుకున్నాడు. ఆ తర్వాత చాటింగ్‌చేస్తూ వ్యక్తిగత ఫొటోలు, నగ్నంగా ఉన్న దృశ్యాల వీడియోలు పంపాలంటూ అభ్యర్థించి పదుల సంఖ్యలో సేకరించాడు.
కొద్దిరోజుల నుంచి వీరికి ఫోన్‌చేసి డబ్బు ఇవ్వకపోతే యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో వాటిని ఉంచుతానంటూ బెదిరిస్తున్నాడు. పదో తరగతి విద్యార్థిని ఫిర్యాదుతో ఇన్‌స్పెక్టర్ రాజు నేతృత్వంలో బృందం మాజిద్‌ను అరెస్టు చేసింది. గతంలోనూ మాజిద్ ఇలాంటి నేరానికి పాల్పడ్డాడు. పోలీసులు హెచ్చరించి వదిలేసినా అతని వక్ర బుద్ధి మారలేదు.












Click it and Unblock the Notifications