యువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు: దేహశుద్ధి

హైదరాబాద్: ఓ యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిని యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నగరంలోని కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది.

జయనగర్‌కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని మూడు అంతస్తులో యువతి స్నానం చేస్తుండగా నిందితుడు వీడియో తీశాడు. గమనించిన యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో స్థానికుల సాయంతో అతడ్ని పట్టుకున్నారు.

అనంతరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు కరీంనగర్ జిల్లా జగిత్యాల వాసి. కాగా, ఉన్నత విద్యావంతుడైన ఆ యువకుడు ఇలాంటి చర్యకు దిగడం పట్ల స్థానికులు మండిపడ్డారు.

A youth arrested in Hyderabad

ప్రేమించడం లేదని యువకుడి ఆత్మహత్యాయత్నం

తను ప్రేమించిన యువతి తనను ప్రేమించడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాగరాజు(25) మిర్యాలగూడలోని కపిల్ చిట్స్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాగా, ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న ఓ యువతితో ఇతడికి ఫోన్లో పరిచయం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఆ యువతి తనను ప్రేమించడం లేదంటూ సోమవారం అవంతిపురం గ్రామంలో నాగరాజు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గుర్తించి 108 వాహనంలో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+