హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంట్లో దూరి రేప్ యత్నం చేశాడు: రాత్రంతా బాత్రూంలోనే గడిపిన యువతి

ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న ఆ యువతి రాత్రంతా బాత్రూంలోనే గడిపింది. ఈ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న ఆ యువతి రాత్రంతా బాత్రూంలోనే గడిపింది. ఈ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన ప్రకారం... ఓ టీవీ ఛాన్‌లో పని చేసే రత్నకుమార్‌ (30) యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌లో ఉంటున్నాడు. సోమవారం పక్కింట్లో ఉన్న వాళ్లు తమ 18ఏళ్ల కుమార్తెను ఇంట్లో ఉంచి ఊరెళ్లారు. ఇది గమనించిన రత్నకుమార్‌ రాత్రి సమయంలో ఆమె ఇంట్లోకి దూరాడు. అత్యాచారం చేయబోయాడు.

A youth attempted rape a girl in Banjara hills

అతడి బారి నుంచి తప్పించుకున్న యువతి... ఇంట్లోని బాత్రూంలోకి దూరి లోపలి గడియా పెట్టుకుంది. రాత్రంతా అందులోనే భయంతో గడిపింది. గది తలుపు తెరవడానికి యత్నిస్తే అరుస్తానని చెప్పడంతో రత్నకుమార్‌ వెనుదిరిగాడు. దీంతో మంగళవారం బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రత్నకుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినోద్‌కుమార్‌ తెలిపారు.

English summary
A youth attempted rape a girl in Banjara hills police limits on Monday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X