హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీటెక్ ఫెయిల్: ప్రేమించలేదని యువతికి నగ్న చిత్రాలు పంపాడు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ యువతి తన ప్రేమను తిరస్కరించదన్న నెపంతో ఓ యువకుడు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. యువతికి పదే పదే ఫోన్ చేసి వేధించడంతోపాటు ఆమెకు నగ్న చిత్రాల పంపాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కినెట్టారు.

సైబర్ క్రైమ్ ఏసీపీ జయరాం తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన రాజ్‌కుమార్ హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో బీటెక్ చదివాడు. ఈ క్రమంలోనే అదే కళాశాలలో బీటెక్ చదువుతున్న యువతితో పరిచయం పెంచుకున్నాడు.

బీటెక్ ఫైనల్ ఈయర్‌కు రాగానే రాజ్‌కుమార్ ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పడంతో సున్నితంగా తిరస్కరించింది. అయితే కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిన నిందితుడు హైదరాబాద్‌లోనే ఉండి ప్రిపేర్ అవుతున్నాడు. ఇదే సమయంలో తమ క్లాస్‌మేట్‌ల సహకారంతో బాధితురాలి సెల్‌ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ తెలుసుకున్న రాజ్‌కుమార్ ఆమెను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు.

A youth harassed a girl

రాజ్‌కుమార్ చాలాసార్లు ఫోన్ కాల్స్ చేయడంతో పాటు ప్రేమిస్తున్నానని మెసేజ్‌లు కూడా పంపాడు. అయితే బాధితురాలు తిరస్కరిం చింది. ఆ తర్వాత నకిలీ మెయిల్ ఐడీలు క్రియేట్ చేసి అసభ్యకర పదజాలంతో పాటు ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన నగ్నచిత్రాలు పంపించి వేధించాడు. దీంతో బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో కొన్ని రోజులపాటు ఎటువంటి మెయిల్స్ పంపని రాజ్‌కుమార్.. ఆ తర్వాత మళ్లీ వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో.. రాజ్‌కుమార్‌ను గచ్చిబౌలిలోని టెలికాంనగర్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అనంతరం కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.

English summary
A youth allegedly arrested for harassing a girl, in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X