Thyronorm: మీ దగ్గర ఆ మందులు ఉంటే వెంటనే మెడికల్ షాప్‍లో ఇచ్చేయండి..

తప్పుగా లేబుల్ చేయబడిన థైరాయిడ్ ఔషధం థైరోనార్మ్(Thyronorm) బ్యాచ్ కదలికపై కఠినమైన నిఘా ఉంచాలని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలోని డ్రగ్ ఇన్స్పెక్టర్లను ఆదేశించింది. అబాట్ కంపెనీ తప్పుగా లేబుల్ అయిన థైరోనార్మ మందులను రీకాల్ చేసింది. అబాట్ కంపెనీ 25 మైక్రోగ్రామ్‌గా తప్పుగా లేబుల్ సీసాలో 88 మైక్రోగ్రామ్ ట్యాబ్లేట్లను వేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన అబాట్ కంపెనీ రీకాల్ చేసింది. అయితే అప్పటికే ఈ ట్యాబ్లేట్లు మధ్యప్రదేశ్, తెలంగాణలో విక్రయించింది.

తప్పుగా లేబులైన థైరోనార్మ్ బ్యాచ్‌ను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తూ అబాట్ ఇండియా లిమిటెడ్ జారీ చేసిన పబ్లిక్ నోటీసు జారీ చేసింది. దీనిపై తెలంగాణలోని డ్రగ్ అధికారులు తదుపరి చర్యలను చేపట్టారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ డ్రగ్ బ్యాచ్ కదలికలపై గట్టి నిఘా ఉంచాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లందరినీ ఆదేశిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న సబ్జెక్ట్ డ్రగ్ బ్యాచ్‌ను రీకాల్ చేసి జాయింట్ డైరెక్టర్‌కు కంప్లైంట్ రిపోర్టు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను కోరింది.

 thyronorm

"భారతదేశంలో హైపోథైరాయిడిజం చికిత్సలో ఉపయోగించే థైరోనార్మ్ ఔషధం ఒక బ్యాచ్ (నం. AEJ0713; Mfg. తేదీ: మార్చి 2023) అబాట్, డోస్ స్ట్రెంత్‌ను తప్పుగా లేబుల్ చేసిన లేబులింగ్ లోపం కారణంగా రీకాల్ చేస్తున్నారు" అని కంపెనీ తెలిపింది. సంబంధిత బ్యాచ్ 88 mcg టాబ్లెట్‌ల సీసాలు 25mcg లేబుల్‌ని కలిగి ఉన్నాయని పేర్కొంది. ఈ బ్యాచ్ మధ్యప్రదేశ్, తెలంగాణలో మాత్రమే అమ్మినట్లు తెలిపింది. అయితే, ఉత్పత్తితో నాణ్యత సమస్యలు లేవని, రోగి ప్రభావం గురించి ఎటువంటి నివేదికలు అందలేదని స్పష్టం చేసింది.

బ్యాచ్ నం. AEJ0713తో థైరోనార్మ్‌ను ఇటీవల కొనుగోలు చేసిన రోగులు, బాటిల్‌ను తాము కొనుగోలు చేసిన మెడికల్ షాప్ కు వెళ్లి తిరిగి ఇవ్వమని లేదా అబాట్‌కు తెలియజేయమని అభ్యర్థించారు. ఈ రీకాల్‌ను సులభతరం చేయడానికి పంపిణీదారులు, భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. సో మీలో ఎవరైనా బ్యాచ్ నెంబర్ AEJ0713, తయారి తేదీ మార్చి 2023, ఎక్సైఫైరి 2025 వరకు ఉన్న థైరోనార్మ్ మందులు కొంటే వెంటనే మెడికల్ షాప్ కు వెళ్లి తిరిగి ఇచ్చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+