Cheetah:సౌదీ రాజు గిఫ్ట్‌గా ఇచ్చిన చిరుత అబ్దుల్లా గుండెపోటుతో మృతి.. హైదరాబాదు జూలో విషాదం..!
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రముఖ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు స్టార్ అట్రాక్షన్‌గా నిలిచిన అబ్దుల్లా అనే చిరుతపులి మృతి చెందింది. అబ్దుల్లా వయసు 15 ఏళ్లు. ఈ చీతా హఠాత్తుగా మరణించడంతో అనుమానం వచ్చిన జూ అధికారులు పోస్టు మార్టం నిర్వహించారు. అబ్దుల్లా అనే ఈ చిరుత పులి గుండెపోటుతో మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఇక హైదరాబాదు జూలో బతికి ఉన్న చివరి చిరుత పులి కూడా ఇక మరణించడంతో ఇటు అధికారులతో పాటు అటు జంతుప్రేమికులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
అబ్దుల్లా అనే ఈ చిరుతపులి భారత్‌కు చెందినది కాదు. 2011లో సౌదీ రాజ కుటుంబీకులు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కును సందర్శించిన సమయంలో రెండు చిరుత పులులను కానుకగా ఇచ్చారు. ఒక ఆడ చిరుతపులి మరొకటి మగ చిరుతపులి. ఆడ చిరుత పులి పేరు హీబా. హీబా, అబ్దుల్లాలు ఎంతో ప్రేమగా ఉండేవని జూ అధికారులు గుర్తుచేసుకున్నారు. ఒకదానిని విడిచి మరొకటి అస్సలు ఉండేటివి కాదని అంతలా ఈ రెండిటి మధ్య ప్రేమ ఉండేదని చెప్పారు.

ఇక ఆడ చిరుతపులి హీబా 2020 లాక్‌డౌన్ సమయంలో మరణించిన తర్వాత అబ్దుల్లా అనే ఈ మగ చిరుతపులి ఒంటరైంది. గత కొన్ని రోజులుగా కూడా యాక్టివ్‌గా కనిపించలేదని కొందరు చెబుతున్నారు.ఈ చిరుతపులి కూడా మరణించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు దక్షిణ భారతదేశంలో మైసూరు జూలాజికల్ పార్కు, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కుల్లో మాత్రమే చిరుతపులులు ఉన్నాయి. ఇప్పుడు రెండు చిరుతపులులు మృతి చెందడంతో హైదరాబాద్ జూలో ఇక చిరుతలు కనిపించవు.

2012లో హైదరాబాద్ వేదికగా జరిగిన కాప్ 11 సమ్మిట్ సందర్భంగా హైదరాబాదుకు విచ్చేసిన సౌదీ రాజు ప్రిన్స్ బందర్ బిన్ సౌద్ బిన్ మొహ్మద్ అల్ సౌద్ ఆఫ్రికా జాతికి చెందిన సింహాలు, చిరుతపులులను బహుమతిగా ఇచ్చారు. 2013లో సౌదీ అరేబియాలోని జాతీయ వైల్డ్ లైఫ్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఈ సింహాలను, చిరుతపులలను స్వీకరించారు. పారాప్లేగియా అనే వ్యాధితో ఆడ చిరుతపులి మృతిచెందింది. 70 ఏళ్ల క్రితమే చిరుతపులులు భారత్‌లో అంతరించిపోయే జంతువుల జాబితాలో చేర్చారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications