అభయ్ లైఫ్‌స్టైల్ చంపేసింది!: హీరోలు కావాలనుకొని, విలన్లు (పిక్చర్స్)

హైదరాబాద్: పదో తరగతి విద్యార్థి అభయ్ హత్య కేసులో నిందితులు చిన్నసాయి అలియాస్ శేషు, రవి, మోహన్‌ల గత చరిత్ర చూస్తే వారు పదో తరగతి మాత్రమే చదివారని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. వారు డబ్బులు సంపాదించేందుకు రాంచీ తదిదతర ప్రాంతాలకు వెళ్లారని చెప్పారు.

పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించేందుకు మల్టీలెవల్ కంపెనీల్లో పని చేశారన్నారు. అక్కడ ఎంత పని చేసినా ఎక్కువ డబ్బులు రాలేదని, దీంతో వారు వెనక్కి తిరిగి వచ్చారన్నారు. అనంతరం అదిలాబాదులోని పని చేసి, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చారని చెప్పారు.

వాళ్లు ఎక్కడా స్థిరపడకుండా డబ్బులు సంపాదించాలనే కోరికతో నిత్యం ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి వాటిని చూసేవారని, అందులోని క్రిమినల్ మెథడ్స్ చూసి డబ్బులు సంపాదించుకోవాలని భావించేవారని చెప్పారు. నిందితులను ముగ్గురిని కోర్టులో ప్రవేశ పెడతామని చెప్పారు.

అభయ్ హత్య కేసులో నిందితులకు సరైన శిక్ష పడేలా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అభయ్ కిడ్నాప్ నుంచి ప్రతి ఆధారం తమ వద్ద ఉందని చెప్పారు. నగరంలో వేలాది సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని, వందల కెమెరాల్లోని సాక్ష్యాధారాలు సేకరించామని, నిందితుల పైన పక్కా ఆధారాలున్నాయన్నారు.

హవాలా కోణం లేదు

అభయ్ తండ్రి హవాలా వ్యాపారం చేస్తాడనే వార్తలు రావడంపై కమిషనర్ స్పందించారు. అభయ్ తండ్రి ఎలాంటి హవాలా వ్యాపారం చేయడం లేదని తేలిందన్నారు. అభయ్ కుటుంబం వద్ద పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయని నిందితులు భావించడానికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పారు.

వారికి మంచి ఏరియాలో సొంత ఇల్లు ఉండటం, మరొకటి అభయ్ నిత్యం కొత్త కొత్త గాడ్జెట్స్ వాడటం.. వారి వద్ద కోట్లు ఉన్నాయని నిందితులు భావించడానికి కారణమని తెలిపారు. మార్కెట్లోకి వచ్చే ప్రతి మోడల్ సెల్ ఫోన్, గాడ్జెట్స్‌ను అభయ్ వాడుతుంటారని చెప్పారు.

అదే సమయంలో చిన్నసాయి ముందు నుంచే తెలుసు కాబట్టి, అభయ్ చిన్నపిల్లాడు కాబట్టి.. తెలిసో, తెలియకో తమ వద్ద బాగా డబ్బుందని చెప్పి ఉంటాడని భావించారు. ఈ విషయంలో ఎక్కడా హవాలా విషయం లేదన్నారు. కాగా అభయ్ తండ్రి స్క్రాప్ వ్యాపారి.

అభయ్ కిడ్నాప్, హత్య

అభయ్ కిడ్నాప్, హత్య

అభయ్ హత్య కేసులో నిందితులు ముగ్గురు సినిమా నటులుగా ఎదగడం కోసం డబ్బులు అవసరమని భావించి, కిడ్నాప్ కథకు తెరలేపినట్లు సీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. తద్వారా నిందితులు సినిమా ద్వారా హీరోలం అవుదామనుకొని విలన్లు అయ్యారు.

అభయ్ కిడ్నాప్, హత్య

అభయ్ కిడ్నాప్, హత్య

నిందితులు ముగ్గురు కూడా అభయ్ హత్యకు రెండు రోజుల ముందు ఒక రొమాంటిక్ క్రైం కథ సినిమా చూసి, దానిని ఫాలో అయ్యారు. ఆ సినిమాను చూసి ఇన్ స్పైర్ అయినట్లు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

అభయ్ కిడ్నాప్, హత్య

అభయ్ కిడ్నాప్, హత్య

అభయ్‌ను ఉద్దేశ్యపూర్వకంగా వారు చంపుదామనుకోలేదు. అయితే, అతనికి నోటితో పాటు ముక్కుకు కూడా ప్లాస్టర్ వేశారు. దీంతో అతను ఊపిరాడక చనిపోయాడు. అతను చనిపోయాక కూడా అభయ్ కుటుంబ సభ్యులను బెదిరించి డబ్బులు తీసుకోవాలని భావించారు.

 అభయ్ కిడ్నాప్, హత్య

అభయ్ కిడ్నాప్, హత్య

అభయ్ చనిపోయాక.. గది నుంచి ట్రాలీలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో మృతుడి సెల్‌ఫోన్‌ను, కళ్లజోడును విసిరేశారు. మృతదేహాన్ని రైల్లో తీసుకెళుతూ డబ్బు డిమాండ్‌ చేయాలనే వ్యూహం పన్నారు. స్టేషన్లో నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కు మూడు టికెట్లు కొన్నారు. రాత్రి 10గంటలకు అభయ్‌ అత్తయ్యకు ఫోన్‌ చేసి రూ.10కోట్లు డిమాండ్‌ చేశారు. అంత డబ్బు లేదని చెప్పిన అభయ్‌ తండ్రి రాజ్‌కుమార్‌ పోలీసులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత 11గంటల సమయంలో నిందితులు రైలెక్కి మరోసారి ఫోన్‌ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

 అభయ్ కిడ్నాప్, హత్య

అభయ్ కిడ్నాప్, హత్య

అభయ్ లైఫ్ స్టయిల్ అతని ప్రాణాలు తీసిందని చెప్పవచ్చు. నిత్యం అతను కొత్త కొత్త గాడ్జెట్స్, మార్కెట్లోకి వచ్చే కొత్త కొత్త మోడల్ ఫోన్స్ వాడుతుండటం వల్ల వారు బాగా ధనవంతులు అయి ఉంటారని నిందితులు అనుమానించారని సీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+