ఏసీ, ఆటోమొబైల్ షాపులు ఓపెన్, కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా, 17వ తర్వాత లాక్ డౌన్‌పై...
హైదరాబాద్ నాలుగు జోన్లలో కరోనా కేసులు ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. మిగతాచోట్ల కేసులు నమోదు కావడం లేదున్నారు. శనివారం నుంచి ఏసీ విక్రయించే షాపులు, ఆటోమొబైల్స్ షాపులు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు. కంటోన్మైంట్, బఫర్ జోన్లలో మాత్రం అనుమతి లేదు అని స్పష్టంచేశారు.
కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు. వైరస్ ఎంతకాలం ఉంటుందో తెలియదని.. కరోనాతో కలిసి జీవించే వ్యుహం అనుసరించాల్సిందేనన్నారు. వైరస్ ప్రభావం దృష్ట్యా నెలకు ఐదుసార్లు సోడియం హైపోక్లోరైడ్ చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. లాక్ డౌన్‌పై 17వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ స్పష్టంచేశారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయని చెప్పారు. దీంతోపాటు వలసకూలీలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మరో 45 బస్తీ దవాఖానాలు నెలకొల్పుతున్నామని కేసీఆర్ తెలిపారు. జూన్ 20వ తేదీ నుంచి హరితహారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రబలిన చోట నివారించేందుకు మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications